రాష్ట్రీయం

సంక్షేమాంధ్ర.. నా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీని సంపూర్ణ సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని, రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సుసంపన్నతలో రాజధాని అమరావతి కీలకపాత్ర వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఈ నెల 11-15 తేదీల్లో సంతోష నగరాల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి ఆదివారం సీఆర్డీఏ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తన బాధ్యతన్నారు. అమరావతి ప్రపంచంలోని అత్యుత్తమ సంతోష నగరాల సదస్సులో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఇది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతుందన్నారు. వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పేదరికం ఉందని, గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 1.1 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినా ప్రజలకు ఇంకా చేయాల్సింది ఉందన్నారు. సంపద సృష్టించకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యంకాదన్నారు. అందుకే తాను సంపద సృష్టించి, దాన్ని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వినియోగించాలని నిర్ణయించానన్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ శ్రేణి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నానని, ఇది సంపద సృష్టిస్తుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆదాయం లేకుండాపోయిందని, ప్రపంచ శ్రేణి రాజధాని అమరావతి అభివృద్ధికి నిర్ణయించానని, ఇది 5కోట్ల ఆంధ్రులకు గర్వకారణమే కాదని, రాష్ట్భ్రావృద్ధికి ఇంజన్ అని అభివర్ణించారు. రాజధాని నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక కేంద్రంగా మారుతుందని, 9 నగరాల ఏర్పాటు ద్వారా ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. 25ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన, 2లక్షల కోట్ల జీడీపీ సాధిస్తామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లాల్సిన అవసరం లేదని, అమరావతిలోనే అన్నీ సృష్టిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగ నాణ్యమైన విద్య, ఉపాధి కోసం వెతికేవారికి గమ్యంగా మారుతుందన్నారు. అమరావతిని సందర్శిస్తున్న ప్రజలు శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సంతోష నగరాల సదస్సును విజయవంతం చేయడం ద్వారా ఏపీ సత్తా మరోసారి చాటాలన్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో ప్రపంచంలోనే అమరావతి ఉత్తమ సంతోష నగరాల్లో ఒకటిగా నిలుస్తుందన్న విషయాన్ని సదస్సులో వివరించాలని చంద్రబాబు సూచించారు. 26 దేశాలకు నుంచి ప్రతినిధులు హాజరు అవుతున్నారని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. టెలీకాన్ఫరెన్సులో మంత్రి నారాయణ, సీఎస్ అనిల్‌చంద్ర పుణేఠా తదితరులు పాల్గొన్నారు.