రాష్ట్రీయం

ఎంపీ టికెట్లకు పోటాపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి కనబర్చే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పర్వం ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న దరఖాస్తుల స్వీకరణకు మొదటి రోజు 25 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమ, మంగళవారం మరో రెండు రోజుల దాకా దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉన్నప్పటికీ, ఆదివారం మంచి తిథి (వసంత పంచమి) కావడంతో ముఖ్య నేతలు పలువురు తమ దరఖాస్తులు సమర్పించారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్ స్థానం నుంచి తిరిగి పోటీకి మాజీ కేంద్ర మంత్రి బల్‌రామ్ నాయక్ దరఖాస్తు చేశారు. అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన (ములుగు) నంగారా భేరీ వ్యవస్థపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ కూడా ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేశారు. నాగర్‌కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి దరఖాస్తు చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన (కొల్లాపూర్) ఎమ్మార్పీఎస్ నాయకుడు సతీష్ మాదిగ కూడా దరఖాస్తు చేశారు. ఏఐసీసీ కార్యిదర్శి వి హనుమంతరావు ఖమ్మం స్థానం నుంచి పోటీకి దరఖాస్తు చేయగా, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, వంగాల స్వామిగౌడ్ ఇరువురు భువనగిరి స్థానానికి దరఖాస్తు చేశారు. నల్లగొండ స్థానానికి పటేల్ రమేష్‌రెడ్డి, వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానానికి ఇందిరా దరఖాస్తులు సమర్పించారు. పార్లమెంట్ స్థానాల నుంచి పోటీకి పార్టీ సీనియర్లు, మాజీ ఎంపీలు రేస్‌లో ఉండటంతో దరఖాస్తు చేసుకోవడానికి కొత్త వారు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి బరిలో ఉండబోతున్నట్టు మాజీ మంత్రి, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీకి మాజీ మంత్రి డికె అరుణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తన పోటీకి మద్దతు కూడగట్టడానికి డికె అరుణ ఇప్పటికే జిల్లా నాయకులతో మంతనాలు జరపుతున్నారు. ఇదే స్థానం నుంచి పోటీకి మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తోన్నట్టు సమాచారం. మల్కాజ్‌గిరి స్థానం నుంచి మరో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఖమ్మం నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి తిరిగి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. అలాగే నిజామాబాద్ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, కర్నాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మధుయాష్కి బరిలో నిలువడానికి ఆసక్తిగా ఉన్నారు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య, మేడ్చల్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి రేస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్‌కు హామీ పొందిన తర్వాతనే విశే్వశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్టు సమాచారం. దీంతో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను కాదని కొత్త వారికి టికెట్ దక్కే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలు సమాచారం. అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు మరో రెండు రోజుల గడువు ఉండటంతో పోటీకి ఆసక్తికనబర్చే అభ్యర్థులు ఎవరన్నది తేలనుంది. ఇలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల సమాయత్త సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.