రాష్ట్రీయం

శ్రీ సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 10: శ్రీపంచమి సందర్భంగా నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో విద్యార్థులు, భక్తులకు దివ్య దర్శనమిచ్చింది. శ్రీపంచమి రోజు అమ్మవారి జన్మనక్షత్రం కావటంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కనకదుర్గమ్మకు ఆదివారం అర్చకులు ఈ ప్రత్యేక అలంకారం చేశారు. సర్వ విద్యలను ప్రసాదించే ఈ చల్లనితల్లిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొంది, జరగబోయే పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంకిస్తూ ఆదివారం ఉదయం నుండే విద్యార్థులు పెద్దసంఖ్యలో ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, రాష్టవ్య్రాప్తంగా భక్తులు కూడా పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఈసందర్భంగా ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మ దేశవ్యాప్తంగా వచ్చే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధిలో శ్రీ సరస్వతీ యాగం చేయించారు. ఈ యాగ ఫలం మొత్తం విద్యార్థులకు దక్కాలని ప్రత్యేక పూజలు జరిపించారు. అంతరాలయంలో, శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న విద్యార్థులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక పెన్ను, అమ్మవారి కుంకుమ ప్రసాదం, చిత్రపటం, అమ్మవారి రక్షా కంకణం ఉచితంగా అందజేశారు. మల్లిఖార్జున మహామండపంలో భక్తులు అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. రాత్రి 9గంటల సమయానికి విద్యార్థులు, సాధారణ భక్తులు సుమారు 70వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.