రాష్ట్రీయం

తెలంగాణ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్ అభినందించారు. సోమవారం కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావుతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారదర్శక పారిశ్రామిక విధానాల గురించి కేటీఆర్ ఆమెకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా సంస్థలకు ఉన్న అవకాశాలపై వారిరువురూ చర్చించారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి చేపట్టిన పథకాల గురించి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, రైతుబంధు, రైతు బీమా పథకాల గురించి కేటీఆర్ ఆమెకు వివరించారు. వ్యవసాయానికి నిరంతరం నిరాటంకంగా ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని నిల్వ చేసుకోవడం, ఇంకా నీటి పారుదల ప్రాజెక్టుల గురించి వివరించారు. అందుకు గిరార్డ్ స్పందిస్తూ అన్ని పథకాలను అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్‌కు జ్ఞాపికను అందజేసి సన్మానించారు.

చిత్రం.. హైదరాబాద్‌లో సోమవారం కేటీఆర్‌తో సమావేశమైన కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్