రాష్ట్రీయం

రైతుబంధుకు షరతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతుబంధు’ (రైతులకు పంటల పెట్టుబడి సాయం) పథకానికి 2019-20 నుండి షరతులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ షరతులు ఎలా ఉండాలన్నది మరో మూడు నెలల్లో తేల్చే అవకాశం ఉంది. భూమి విస్తీర్ణంపై 10 ఎకరాలకు మించకుండా గరిష్ట పరిమితి విధించడం, పెట్టుబడి కోసం ఏయే పనులకు డబ్బు ఖర్చు చేశారో రసీదులు సమర్పించాలని కోరడం, పంటలను సాగు చేసే వారికే సాయం అందేలా చూడటం తదితర రూపాల్లో షరతులు ఉండవచ్చని భావిస్తున్నారు. 2018-19 సంవత్సరంలో రైతుబంధును ప్రారంభించిన సమయంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి షరతులు విధించలేదు. దాంతో ఈ పథకం అమలులో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని ప్రభుత్వం చేసిన సర్వేలో తేలింది. ఈ కారణంగానే 2019-20 సంవత్సరం నుండి రైతుబంధు అమలులో షరతులు పెట్టాలన్న ఆలోచన వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్‌జీఓ) లు, ఆర్థిక నిపుణులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు సేకరించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతుబంధు ఉత్తమమైన పథకమేనని, అయితే ఈ పథకం అమల్లో ఇప్పటి వరకు ఎలాంటి షరతులు లేవని, అందువల్ల రైతుబంధుకు కూడా ‘షరతులు’ పెట్టాలన్న అభిప్రాయాలు వివిధ వర్గాల నుండి వచ్చాయి. ఇప్పటి వరకు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతుబంధు కింద ఎకరానికి ఒక సీజన్‌కు నాలుగువేల రూపాయల చొప్పున చెల్లించారు. 80 శాతం చిన్న సన్నకారు రైతులే ఉన్నప్పటికీ, పెద్ద రైతులకు కూడా డబ్బు చెల్లించారు. పట్టేదార్ అయితే చాలు..్భమి ఉంటే చాలు..రైతు పేరుతో పట్టాదార్ పాస్‌పుస్తకం ఉంటే చాలు..ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున చెల్లించారు. వంద ఎకరాలు ఉన్నవారికి నాలుగు లక్షల రూపాయల వరకు లభించాయి. హైదరాబాద్ నగరానికి దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో డబ్బు ఉన్న చాలా మంది భూములు కొనుగోలు చేశారు. ఈ విధంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా బడాబాబుల చేతుల్లో భూములున్నాయి. అలాగే వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లా కేంద్రాలకు ఆనుకుని ఉన్న మరో ఐదు లక్షల ఎకరాలు కూడా బడాబాబులు కొనుగోలు చేశారు.
ఇప్పటి వరకు ఎవరికీ అంతుచిక్కని ఒక సమస్య ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంది. పట్టేదార్లుగా ఉన్నవారు 58 లక్షల మంది రైతులని తేలింది. వీరి పేర్లతో ఉన్న మొత్తం భూమి సుమారు 150 లక్షల ఎకరాలుగా తేలింది. ప్రభుత్వం తీసుకున్న
నిర్ణయం మేరకు 150 లక్షల ఎకరాలకు ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున ఖరీఫ్‌కు 6000 కోట్ల రూపాయలు, రబీకి 6000 కోట్ల రూపాయల చొప్పున 2018-19 వార్షిక బడ్జెట్‌లో కేటాయించారు. అంటే మొత్తం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణలో ఇంతవరకు ఏ సీజన్‌లో కూడా సాగైన భూమి విస్తీర్ణం 110 లక్షల ఎకరాలకు మించలేదు. అంటే ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 40 లక్షల ఎకరాలకు సంబంధించి 1600 కోట్ల రూపాయలు సాగుకాని (పడావు) భూమికి చెల్లించినట్టయింది. ఈ నిధులు పంటల కోసం ఉపయోగపడలేదని స్పష్టమవుతోంది.
నిధుల కొరత
2018-19 రబీ సీజన్‌కు రైతుబంధుకు నిధుల కొరత ఏర్పడింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు 2018 డిసెంబర్ ఏడున వెలువడ్డాయి. అప్పటి వరకు రైతుబంధు కింద దశలవారీగా రైతుల పేర్లతో బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఆ తర్వాత ఈ పథకానికి చెల్లించాల్సిన నిధులను ఆర్థిక శాఖ విడుదల చేయలేదు. అనధికారిక సమాచారం ప్రకారం దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు రైతులకు 2018-19 రబీకోసం చెల్లించాలి. ఇప్పటి వరకు ఈ డబ్బు చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తారో అధికార వర్గాలు వెల్లడించడం లేదు.
షరతులు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీ
2019-20 సంవత్సరానికి అమలు చేయబోయే రైతుబంధు కోసం షరతులు ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. షరతులు విధించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ కమిటీని పార్లమెంట్ ఎన్నికల తర్వాత నియమించి, నివేదిక తెప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుబంధు సాయాన్ని ఎకరానికి 4000 రూపాయల నుండి 5000 రూపాయలకు పెంచాలని, రెండు పంటలకు (ఖరీఫ్, రబీ) కలిపి 10 వేల రూపాయలు రైతులకు చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. న్యాయమైన షరతులు విధించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా భారం 12 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.