రాష్ట్రీయం

నెలాఖరులోగా ఎంపీ అభ్యర్థుల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంట్‌కు పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరకల్లా ప్రకటిస్తారని శాసనసభా కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు. ఎంపీ స్థానాలకు పోటీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా పెద్దమొత్తంలో వచ్చాయన్నారు. పోటీకి ఎక్కువ మంది ఆసక్తికనబర్చడమంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఆదరణ తగ్గలేదన్నదానికి నిదర్శనమన్నారు. గాంధీభవన్‌లో సోమవారం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా? లేదా? అనేది కూడా నెలాఖరకల్లా స్పష్టత వస్తుందన్నారు. శాసనసభ ఎన్నికల్లో భావ సరూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీ చేసినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలా? వద్దా? అనేది రాష్ట్ర నాయకులు విస్తృతంగా చర్చించి అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోనలు చేస్తోన్న ప్రభుత్వానికి పట్టడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ఎర్రజొన్నలను కొనుగోలు చేశామని ప్రభుత్వం చెబుతున్నది పచ్చి అబద్దమని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దళారులు రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రజొన్నకు మూడు వేల మద్దతు ధర ప్రకటించి రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టిస్తామన్న ఎంపీ కవిత హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పసుపు పండించిన రైతులను నుంచి కొనుగోలు చేసేవారేలేరన్నారు. క్వింటాల్‌కు 10 వేల రూపాయల చొప్పున ప్రభుత్వమే పసుపు కొనాలని భట్టి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుందని, రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాడటానికి సీఎల్పీ సిద్దంగా ఉందని భట్టి హెచ్చరించారు.