రాష్ట్రీయం

మళ్లీ బీజేపీదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 11: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం ఖాయమని అందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ముఖ్యంగా బూత్‌లెవల్ కార్యకర్తలు, శక్తికేంద్రాల ఇన్‌చార్జిలు ప్రజల్లోకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలంటూ కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లిలో గల వైట్‌హౌజ్ కనె్వక్షన్‌హల్‌లో నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపారన్నారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు అనుభవిస్తుంటే చూసి ఒర్వలేక ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తమ రాజకీయ ఉనికిని ఎలా కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నాయని ఆరోపించారు. ఐదేళ్లపాటు ప్రధానీ నరేంద్రమోదీ పాలన నితివంతమైన పాలన కొనసాగిందని ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదని ఇలాగైతే తమ ఖజానా ఎలా నిండేదని భావించిన కొందరు ప్రతిపక్ష నాయకులు పదేపదే కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. 55 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు దేశప్రజలకు చేసింది ఏమీటని ప్రశ్నించారు. నరేంద్రమోదీని రెండవసారి ప్రధానమంత్రిని చేయడానికి దేశప్రజలంతా ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధానీ నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని ఆమె తెలిపారు. దేశంలో పేదరికాన్ని తరిమికొట్టడానికి 15కోట్ల మందికి 10లక్షల నుండి 50లక్షల వరకు బ్యాంకుల ద్వారా ఆర్థిక పెట్టుబడి రుణాలను అందించిన ఘనత మోదీకే దక్కిందన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలను కూడా గౌరవంచలేదని వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతిసిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్రమోదీ ప్రధానీ అయ్యాక 9కోట్లమంది మహిళలకు మరుగుదొడ్లు నిర్మించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. 6కోట్ల మంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్‌కనెక్షన్లు ఇచ్చిన ఘనత కూడా మోదీకే దక్కిందన్నారు. గత ప్రభుత్వాలు పేదల గురించి పట్టించుకోలేదని వారి కుటుంబాలకు మాత్రమే పెద్దపీఠ వేసి దేశాన్ని దోచుకుంటున్నారని ఘాటైన విమర్శలు చేశారు. మళ్లీ ఎలాగైన దేశాన్ని లూటీ చేయాలనే ఆలోచనతో కూటములుగా ఏర్పడి అధికారంలోకి రావాలని చూస్తున్నారని కానీ దేశప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ నరేంద్రమోదీనే ప్రధానీని చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. దేశానికి నీతిపరులు కావాలో అవినీతిపరులు కావాలో ప్రజలకు బాగా తెలుసని అవినీతిపరులను అధికారంలోకి తీసుకువచ్చినట్లు అయితే ప్రజలజీవితాలు బ్రష్టుపట్టిపోతాయన్నారు. దేశాన్ని దోచుకునేవారికి రాజ్యాధికారం ఇవ్వకూడదని అప్పుడే దేశం అభివృద్ధి పతంలో నడుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్మన్ భారత్ పథకాన్ని వినియోగించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పేదల ఆరోగ్య సంక్షేమం కోసం రూ.5లక్షల మేర ఈ పథకంలో కేంద్రం సహయం చేస్తుంటే ప్రజలకు ఈ పథకం లబ్ది చేకూరితే బీజేపీకి పేరు వస్తుందని భావించిన టీఆర్‌ఎస్ నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించకున్నప్పటికిని పెద్ద ఎత్తున కేంద్రం చేయూతను అందిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధిక స్థానాల్లో గెలిచితీరుతుందన్నారు. అందుకు బూత్‌స్థాయి కార్యకర్తలు, శక్తికేంద్రాల ఇన్‌చార్జిలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ నాయకులు శాంతికుమార్, శ్రీవర్థన్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు , నాగురావునామాజీ, ఆచారి, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ