రాష్ట్రీయం

నిబంధనలు అతిక్రమించిన భారతీయ విద్యార్థులు వెనక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: అమెరికా మిచిగాన్‌లోని ఫర్మింగ్టన్ యూనివర్శిటీలో అడ్మిషన్ తీసుకుని వీసా నిబంధనల అతిక్రమణలకు పాల్పడిన భారతీయ విద్యార్థులు సర్దుకుంటున్నారు. మిగిలిన వేరే యూనివర్శిటీల్లో చేరి వీసా నిబంధనలను అతిక్రమించి పే టు స్టేలో కొనసాగుతున్న విద్యార్థులు స్వదేశానికి చేరుకుంటున్నారు. కొంత మంది భారతీయ విద్యార్థులు సమీపంలోని వేరే యూనివర్శిటీల్లో సర్దుబాటు చేసుకున్నారు. ఫర్మింగ్టన్ యూనివర్శిటీల్లో ప్రవేశాలు పొంది అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల కళ్లల్లో పడిన భారతీయ విద్యార్థులను అక్కడి హోం ల్యాండ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదే తరహాలో మిగిలిన యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొంది ఎంఎస్ రెండో సంవత్సరానికి రాక ముందే తొలి రోజు నుండి ఉద్యోగాల్లో చేరిన మరికొంత మంది భారతీయ విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలుగు వారు వెనక్కు వస్తున్నారు. ఇంత వరకూ 30 మంది విద్యార్థులు హోం ల్యాండ్ అధికారు ల ముప్పు తప్పించుకుని స్వదేశానికి చేరుకున్నారు. ముందు గా తమకు ఉన్న ఇబ్బందిని తెలియజేసి స్వదేశానికి రావడం వల్ల ఎలాంటి కేసులు లేకుండా వారు బయపడేందుకు వీలుందని చెబుతున్నారు. అమెరికాలో గోప్యంగా పనిచేయడం వల్ల లేనిపోని తలనొప్పులు ఉంటాయని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.
దూరంగా ఉన్న యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన వారు, సమీపంలోని యూనివర్శిటీలకు మార్పిడి చెందారని మరికొంత మంది స్వదేశానికి తిరిగి పయనమయ్యారని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సమన్వయకర్త కే బుచ్చిరాం చెప్పారు. ఇప్పటికే అమెరికా హోం ల్యాండ్ అధికారుల అదుపులో ఉన్న విద్యార్థులకు సైతం ఎలాంటి ముప్పు ఉండబోదని బుచ్చిరాం పేర్కొన్నారు. భారత్‌లో సరైన ఉద్యోగాలు వెతుక్కుని వారు వెనక్కు వెళ్లేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే ఎంఎస్ పూర్తి చేసిన వారున్నారని అదే విధంగా స్టెమ్ కోర్సుల్లో కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (సీపీటీ) మేనేజిమెంట్ కోర్సుల్లో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఉన్న వారున్నారని చెప్పారు. ఒక వేళ మూక్స్ ద్వారా లేదా ఆన్‌లైన్ కోర్సులను ఆయా యూనివర్శిటీలు ఆఫర్ చేస్తున్న పక్షంలో విద్యార్థులు వాటికి మార్పిడి కావచ్చని పేర్కొన్నారు. నేరుగా సొంత డబ్బులతో వచ్చిన వారికి కొంత సౌలభ్యం ఉన్నా, బ్యాంకు రుణాలతో వచ్చిన వారు మధ్యలో చదువు మానేయడం లేదా మార్పు చేసుకోవడం కాస్తా సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటుందని, వారు అమెరికాలో కొనసాగాల్సిందేనని చెప్పారు. ఫర్మింగ్టన్ యూనివర్శిటీలో చేరేందుకు ఒక్కో విద్యార్థి 20వేల డాలర్లు నుండి 25వేల డాలర్లు చెల్లించారని ఇదంతా వారికి తడుపుమోపెడు అవుతుందని పేర్కొన్నారు.