రాష్ట్రీయం

ఇది రాక్షసులతో యుద్ధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 11: ‘రాష్ట్రంలో నీతివంతమైన పాలన కోసం యుద్ధం చేస్తున్నాం.. పోరాటం నీతిగల వారితో కాదు.. న్యాయంగా ఉండే వారితోనూ కాదు.. రాక్షసులతో చేస్తున్నాం.. అన్యాయానికి ప్రతి రూపంగా ఉన్న వారితో యుద్ధం చేస్తున్నాం.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నుతున్న వారితో పోరాడుతున్నాం.. అలాంటి కుట్రలకు తెర తీసిన, మోసపూరిత వాగ్దానాలతో మోసగిస్తున్న చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండండి.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పండి’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం నగర శివారులో నిర్వహించిన సమర శంఖారావం కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు సమీపించినపుడే చంద్రబాబుకు జనం గుర్తొస్తారన్నారు. నాలుగున్నరేళ్లు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, మరో మూడు నెలల్లో ఎన్నికలుండగానే, ఇప్పటికే రెండు సినిమాలు చూపించిన ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కొత్తగా మూడో సినిమాకు తెర తీశారన్నారు. అలాంటి బాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి లేని స్వచ్ఛ పాలన రావాలి.. నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. మనమే అధికారంలోకి వస్తాం.. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తామని జగన్ అన్నారు. ఈ తొమ్మిదేళ్ల తన రాజకీయ ప్రయాణంలో తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాను.. అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. గడచిన ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులపై 1280 అక్రమ కేసులు బనాయించారని, అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్నీ ఉపసంహరిస్తానని పార్టీ శ్రేణులకు మనో ధైర్యాన్ని కల్పించారు. రాష్ట్రంలో, తెలంగాణలో 59,18000 బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటిలో 30 లక్షల కోట్లు ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉన్నాయని అవన్నీ తొలగించే చర్యలు చేపట్టండని సూచించారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమేనన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లు తొలగిస్తున్నారని, ఓటరు జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోండి, ఓటు లేకపోతే కచ్చితంగా నమోదు చేసుకోండన్నారు. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సీ-విజిల్ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోండి.. మీపేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే ఆ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయండి.. నిబంధనల మేరకు 100 నిముషాల్లోనే రిటర్నింగ్ ఆఫీసర్ నివేదిక ఇవ్వాలని, లేకుంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని జగన్ వివరించారు. ఎన్నికలొస్తున్నాయంటే చంద్రబాబు చేయని మోసం లేదు, చెప్పని అబద్ధం ఉండదు..ఈ ఎన్నికల్లో మనం యుద్ధం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదు..ఎల్లో మీడియా, కాంగ్రెస్ పార్టీతో కూడా.. అంటూ కొన్ని ఛానళ్ల పేర్లు ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండండి అని కోరారు. బోగస్ ఓట్లు నమోదు చేసే కుట్రకు బాబు తెర తీశారని, మీ ఓటు కొంటున్న ఆయనకు బుద్ధి చెప్పండన్నారు. ఎన్నికలకు చంద్రబాబు డబ్బు మూటలు పంపిస్తున్నారని, ప్రతి ఓటరు చేతిలో రూ.3 వేలు పెడతారని, డబ్బు కోసం మోసపోవద్దు.. అమ్ముడుపోవద్దు..అని గ్రామగ్రామానా చెప్పండని విజ్ఞప్తి చేశారు. రేపు మన ప్రభుత్వం వస్తుందని, అన్న (జగన్) ముఖ్యమంత్రి అవుతాడని, ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పిల్లల్ని బడికి పంపితే ఏడాదికి రూ.15 వేలు అమ్మ ఒడి ద్వారా ప్రతి ఒక్కరికీ ఇస్తామని చెప్పండన్నారు. అన్న చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 4 దఫాలుగా ఏడాదికి రూ.రూ.75 వేలు అన్న ఇస్తాడని వివరించాలన్నారు. పెన్షన్ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్నారు. ఇంట్లో ఎవరికి ఆరో గ్యం బాగోలేకపోయినా ఖర్చు రూ.వెయ్యి దాటితో ఆ ఖర్చులన్నీ భరిస్తామన్నారు. అన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ నెరవేరుస్తాడని చెప్పండి అంటూ పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేశారు. చంద్రబాబు రూ.3 వేలు ఇస్తామంటే, రూ.5 వేలు అడగండి.. ఒక్క క్షణం కళ్లు మూసుకుని దేవున్ని స్మరించి మనస్సాక్షికి ఓటు వేయండి అని సూచించారు.
2014 ఎన్నికల్లో హామీలిచ్చి ఒక సినిమా తీసి డైలాగులు చెప్పారని, ఆవేవీ నెరవేరలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ నాలుగేళ్లు బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కాపురం చేశాక నల్లచొక్కాలు ధరిస్తాడు.. ఢిల్లీకి పోతాడు.. పార్లమెంట్ అయిపోయాకా.. ధర్మ దీక్షలంటాడు..యుద్ధం, పోరాటం అంటూ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు, మూడు నెలల కోసం రెండో సినిమాకు తెర తీస్తారని వ్యాఖ్యానించారు. వారం ముందు తనది కాని, తనకు అధికారం లేని, తన హయాంలో రాని బడ్జెట్ ప్రవేశపెట్టి, రైతు సుఖీభవ అంటూ చెవిలో పూలు పెడుతూ మూడో సినిమాకు తీశారంటూ, ఎవరైనా రూ.5 కోట్లు జీతభత్యాలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా.. ఈయన ఏకంగా రూ.2 లక్షల 26వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారని విమర్శించారు. జగన్ పథకాలను సరిగా కాపీ కూడా కొట్టలేని సీఎం అంటూ ఎద్దేవా చేశారు. మూడు నెలలు ఆగండి.. మన ప్రభుత్వం వస్తుంది. స్వచ్ఛ, పేదలు కోరుకునే పాలన అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు.
చిత్రాలు.. అనంతపురం నగర శివార్లలో సోమవారం నిర్వహించిన సమర శంఖారావం సభలో ప్రసంగిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి