రాష్ట్రీయం

అరవై ఏళ్ల తర్వాత అరుదైన అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11: అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ మూర్తి భక్తులకు మంగళవారం రథ సప్తమి సందర్భంగా అరుదైన అవకాశం లభించనుంది. స్వామి వారి మూలవిరాట్ నిజరూప దర్శనం వరుసగా రెండు రోజులు చేసే అవకాశం కలగబోతోంది. రథసప్తమి, కుంభ సంక్రమణం మంగళ, బుధవారాల్లో రావడంతో మహాక్షీరాభిషేకం సేవలో భక్తులు తరించబోతున్నారు. దాదాపు 60 ఏళ్ల అనంతరం శ్రీ విళంబినామ సంవత్సర మాఘ శుద్ధ సప్తమీ మంగళవారం ఆదిత్యుని జయంత్యుత్సవం (రథసప్తమి), బుధవారం భీష్మాష్టమి కుంభసంక్రమణం కలిసిరావడంతో మహాక్షీరాభిషేకం అంగరంగవైభవంగా మొదలైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక గణపతి పూజ అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి మూలవిరాట్‌కు మహాక్షీరాభిషేకం సేవలు మొదలయ్యాయి. మానవాళికి వెలుగును ప్రసాదించే ఆదిత్యుని జన్మదినం సందర్భంగా అరసవల్లి భక్తజనకోటితో కిటకిటలాడింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆదిత్యుని నిజరూపంలో భక్తులకు దర్శమిచ్చాడు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి మహాక్షీరాభిషేకం నిర్వహించారు. సమస్తలోకానికి ఆరోగ్యానిచ్చే ఆదిత్యుని నిజరూపం దర్శనం తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు.