రాష్ట్రీయం

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 11: రానున్న ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాకు వివిధ రాజకీయపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నగరానికి చేరుకున్న సునీల్ అరోరాను వివిధ రాజకీయ పక్షాల నేతలు కలిసి వినతిపత్రాలు అందించారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో బీజేపీ నేతలు జె రంగరాజు, సీపీఐ నేత జెల్లి విల్సన్, సీపీఎం నేత వై వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత తాంతియా కుమారి, టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్ట్భారాం, వైకాపా నేత కె పార్థసారథి ఉన్నారు. అనంతరం పార్టీ నేతలు మీడియాను కల్సి మాట్లాడారు.