రాష్ట్రీయం

మరో ముగ్గురు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్/మహబూబ్‌నగర్/నల్లగొండ, డిసెంబర్ 2: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయ. వ్యవ సాయం కోసం చేసిన చేసిన అప్పు లు పెను భారంగా పరిణమించడం, రుణాలు మాఫీ చేస్తామన్న పాలకుల హామీలు ‘నీటిపై రాతలు’గా మిగిలిపోవడం వారి పాలిట యమ పాశాలు అవుతున్నాయ. తాజాగా అప్పుల బాధలు భరించలేక వివిధ జిల్లాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ఒక రైతు గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా రామాయంపేట రామాయంపేట పట్టణానికి చెందిన పోచమ్మల స్వామి (35) వ్యవసాయం కోసం చేసిన 4 లక్షల అప్పును ఎలా తీర్చాలో మనోవేదనకు గురై రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయి గొల్పర్తి శివారులో పురుగుల మందు సేవించి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే మండలం రాయిలాపూర్ పంచాయతీ పరిధిలోని సుతారిపల్లి గ్రామానికి చెందిన రాగి పెద్దవాల్లొల్ల శ్రీకాంత్ (28) బుధ వారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండల పరిధిలో రాంపూర్ గ్రామానికి చెందిన కుర్వ రాజు (35) అనే రైతు మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెం దాడు. నల్లగొండ జిల్లా అనుముల మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన పత్తిరైతు ఆంగోతు లక్ష్మా నాయక్ (40) అప్పుల బాధ తాళలేక బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పీఎల్‌జీఏ వారోత్సవాలు హింసాత్మకం

భద్రాచలం, డిసెంబర్ 2: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) వారోత్సవాల నేపథ్యంలో తొలిరోజు బుధవారం ఛత్తీస్‌గఢ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లోని దండకారణ్యంలో చోటు చేసుకున్న సంఘటనలతో వాతావరణం హింసాత్మకంగా మారింది. సుకుమా జిల్లా డోర్నపాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని చింతలనార్ పోలీసు బేస్‌క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు దాడి చేశారు. సుమారు 150 మంది సాయుధ మావోయిస్టులు క్యాంపును చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. వీరిని బేస్ క్యాంపులోని పోలీసులు సమర్థవంతంగా ప్రతిఘటించడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు కోయిలీబేడ పోలీసుస్టేషన్ పరిధిలోని బర్కనార్ గ్రామం వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని రాజధాని రాయపూర్‌కు తరలించారు. వీరిలో బైజూరామ్ అనే జవాను పరిస్థితి విషమంగా ఉంది. బస్తర్ ఐజీ కల్లూరి సమక్షంలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. కోశిమర్కామ్ అనే ప్లాటూన్ నెం.26 డివిజన్ కమిటీ సభ్యుడు, జన మిలీషియా సభ్యుడు సంతరామ్‌కుండల్, బార్‌సూర్ జన మిలీషియా కమిటీ సభ్యుడు రామ్‌బతి కొర్రామ్ లొంగిన వారిలో ఉన్నారు. వీరిపై రూ.2 లక్షల మేర రివార్డులు ఉన్నాయి. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీసుస్టేషన్ పరిధిలో మాంజీ కుర్సుబోడీ అనే గ్రామంలో ముగ్గురు మావోయిస్టులను పోలీసు బలగాలు అరెస్టు చేశాయి. ఇదిలా ఉండగా ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో కూంబింగ్ బలగాలు ఆరుగురు మిలీషియా కమాండర్లను అరెస్టు చేశాయి. వారు సుద్దకొండ, రాజులకొండ, కురువు గ్రామాలకు చెందిన మిలీషియా కమాండర్లుగా కలిమెల పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణ శివారు గ్రామాల్లో మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేసి సంచలనం సృష్టించారు. తొలిరోజు వారోత్సవాల్లో మావోయిస్టులు దండకారణ్యంలో దుందుడుకుతనాన్ని ప్రదర్శించడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని దండకారణ్య పరిసరాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

కాంకేర్‌లో అరెస్టయిన మావోయిస్టులు, గాయపడిన జవాను