రాష్ట్రీయం

ఆ 142 సంస్థలూ మావే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్ర విభజన చట్టం పదవ షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆస్తులను వెంటనే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయనున్నారు. శనివారం ఇక్కడ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పదవ షెడ్యూల్ ప్రకారం 142 ఇనిస్టిట్యూషన్లు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించాల్సి ఉంది. కేంద్రం ఆదేశించినా, తెలంగాణ ప్రభుత్వం అందుకు ముందుకు రాలేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ ఆస్తులను బదలాయించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. వీటి బదిలీపై ఏపి చీఫ్ సెక్రటరీ, తెంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి లేఖ రాయనున్నారు.ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన తరువాత పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చే నాలుగు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో నాలుగు గ్రామాలు తిరిగి తెలంగాణలో విలీనం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనపై మంత్రి పల్లె రఘునాథరెడ్డిని వివరణ కోరగా, కేంద్రం ఒకసారి ఇచ్చిన ఆదేశాలు వెనక్కు తీసుకోదని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటును భర్తీ చేయాలని కోరుతూ ప్రధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయనున్నారని రఘునాథరెడ్డి తెలియచేశారు.