రాష్ట్రీయం

మిస్సోరి యూనివర్శిటీ అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మిస్సోరి స్టేట్ యూనివర్శిటీ పీజీ, యూజీ అడ్మిషన్లలో అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులకూ ఈ రాయితీలు వర్తిస్తాయని యూనివర్శిటీ ప్రతినిధి బ్రాడ్ బాడెన్‌హాసన్ తెలిపారు. శాట్‌లో 1160 కంటే మించిన స్కోర్ సాధించిన వారికి యూజీలో 7500 డాలర్లు, 1230 కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి 10వేల డాలర్లు, గ్రాడ్యూయేషన్‌లో 3.25 సీజీపీఏ ఉన్న వారికి పీజీ కోర్సులో 2500 డాలర్లు స్కాలర్‌షిప్ అందుతుందని ఆయన వివరించారు. దరఖాస్తులకు సాధారణ తుది గడువు ఏప్రిల్ 30 కాగా, స్కాలర్‌షిప్ కోరుకునే వారు మార్చి 15లోగా దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు.