రాష్ట్రీయం

ఓపెన్ కాస్ట్ గనిలో పేలుళ్లు నిలిపివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాకతీయ ఓపెన్ కాస్ట్ గని-2లో 500 మీటర్లలోపు పేలుళ్లను తక్షణమే నిలిపి వేయాలని సింగరేణి సంస్థను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాకతీయ ఓపెన్ కాస్ట్ ఉపరితల గనిలో నిబంధనలకు విరుద్ధంగా 500 మీటర్లలోపే పేలుళ్ల జరుపుతున్నారని స్థానికుల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ఎన్జీటీలో దాఖలైన పిటిషన్‌పై ట్రిబ్యునల్‌లోని జస్టిస్ రాఘవేంద్ర ఎస్. రాథోడ్ బెంచ్ 500 మీటర్లలోపు పేలుళ్లను నిలిపివేయాలని సింగరేణి సంస్థకు ఆదేశాలు శుక్రవారం జారీ చేసింది.