రాష్ట్రీయం

కృష్ణా ట్రిబ్యునల్‌లో విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నదీజలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ మార్చి 13, 14, 15 తేదీలకు వాయిదా పడింది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరపు సాక్షి, వ్యవసాయరంగ నిపుణుడు పళనిస్వామిని, ఏపీ తరపు న్యాయవాది ఏకే గంగూలీ, న్యాయవాది ఉమాపతి శుక్రవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా నది ప్రాం తంలో నీటి పారుదల, వినియోగం తదితర అంశాలపై ఏపీ న్యాయవాదుల ప్రశ్నలకు పశనిస్వామి సమాధానాలు ఇచ్చారు. సమయం ముగియడంతో విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.