రాష్ట్రీయం

శిఖరం.. సునాయాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ప్రపంచంలోని నాలుగు ఖండాల్లో ఉన్న నాలుగు ఎత్తయన పర్వతాలను అధిరోహించడం ద్వారా తెలంగాణ గిరిజన బాలిక మరో సరికొత్త రికార్డును సాధించింది. గతంలో మూడు శిఖరాలను అధిరోహించిన మలావత్ పూర్ణ తాజాగా అర్జెంటీనాలోని అకంకగువా శిఖరాన్ని అధిరోహించింది. అర్జెంటీనాలో ఉన్న మలావత్ పూర్ణను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అభినందించారు. ఇంతవరకు పూర్ణా ఆఫ్రికాలోని కిలోమంజోరో, యూరప్‌లోని ఎల్‌బ్రూస్, దక్షిణ అమెరికాలోని అకంకగువా, ఆసియాలోని ఎవరెస్టు శిఖరాలను అధిరోహించింది. ఇంకా ప్రపంచంలో మరో మూడు ఎత్తయన శిఖరాలున్నాయి. వాటిని కూడా అధిరోహించడం ద్వారా ప్రపంచంలోని ఏడు ఎత్తయన శిఖరాలు అధిరోహించాలనే తపనతో ఉన్నట్టు మలావత్ పూర్ణ తెలిపారు. ఉత్తర అమెరికాలోని వౌంట్ దినాలి, అంటార్కిటికాలోని విన్సన్ మసిఫి, ఆస్ట్రేలియాలోని కాసియజ్కో శిఖరాలను అధిరోహించాల్సి ఉందని ఆమె చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బాలికలకు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, అందిస్తున్న అనితరసాధ్యమైన మద్దతు తాను ఈ విజయాలు సాధించేందుకు దోహదం చేశాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ పూర్ణను అభినందించారు. పర్వతారోహణలో అతి పిన్నవయస్కురాలైన పూర్ణ సాధించిన విజయం అమోఘమని అన్నారు. ఆమె తల్లిదండ్రులు లక్ష్మీ, దేవదాస్‌లు వ్యవసాయ కూలీలుగా నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామంలో పనిచేస్తున్నారని, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి దేశం గర్వించదగిన విజయాలను నమోదుచేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుతం పూర్ణ కామారెడ్డి గురుకుల డిగ్రీ కాలేజీలో విద్యనభ్యసిస్తోందని, ఆమె జీవిత చరిత్రను నిర్మాత రాహుల్ బోస్ చలనచిత్రంగా నిర్మించారని, రెండేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి న్యూయార్క్‌లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీలోనూ పూర్ణ పాల్గొందని అన్నారు. ట్రానె్సండ్ అడ్వంచర్స్ సంస్థ డైరెక్టర్ శేఖర్ బాబు ఈసారి ఆమె పర్యటనకు ఆర్థిక సాయం అందించారని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.

చిత్రం.. అర్జెంటీనాలోని అకంకగువా శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలంగాణ గిరిజన బాలిక పూర్ణ