రాష్ట్రీయం

నా జోలికి రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: నా జోలికి రాకండి... మీ పరిధిలో మీరుండండి అంటూ మంత్రి గంటాకు ఇటీవలే వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ సూచించారు. రాజకీయాల్లో విలువలపై మంత్రిగా ఉన్న మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన అవంతి శుక్రవారం విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. నేను టీడీపీలో తనకు తానుగా చేరలేదని, ఆ పార్టీ అధిష్ఠానమే పిలించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. గంటా తనతో పాటు ఐదుగురికి అడిగిన చోట్ల టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి టీడీపీలోకి తీసుకెళ్లారని, చేరాక మాట నిలబెట్టుకోకుండా భీమిలి టిక్కెట్ అడిగితే అనకాపల్లి ఎంపీగా పంపారన్నారు. భీమిలి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా మంత్రి గారి ఎథిక్స్ చెబుతారన్నారు.