రాష్ట్రీయం

నెలాఖరులోగా తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అభ్యర్థుల ప్రకటనలో జాప్యం వల్ల శాసనసభ ఎన్నికల్లో నష్టం జరిగిందని భావిస్తోన్న కాంగ్రెస్ అధిష్ఠానం పార్లమెంట్ ఎన్నికలకు ఇతర పార్టీల కంటే ముందుగానే సన్నద్ధం అవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యూహంపై సమీక్షించిన పార్టీ, మరోవైపు పోటీకి ఆసక్తికనబర్చే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరించింది. శాసనసభ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు స్థానాలు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మూడేసి స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడంతో పై మూడు జిల్లాల్లోని పార్లమెంట్ స్థానాలకే పోటీ ఏర్పడింది. టీడీపీతో పొత్తు వల్లనే శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందని భావిస్తోన్న ఆశావహులు ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి, వి హనుమంతరావు, పార్లమెంట్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి రేస్‌లో ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హుజూర్‌నగర్ (ఉత్తమ్‌కుమార్‌రెడ్డి), నకిరేకల్ (చిరుమర్తి లింగయ్య) మునుగోడు (కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి) మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో నల్లగొండ నుంచి పోటీకి శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పోటీ పడుతున్నారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌బినగర్ నుంచి సుధీర్‌రెడ్డి, తాండూరు నుంచి పైలెట్ రోహిత్‌రెడ్డి గెలుపొందారు. శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో విశే్వశ్వర్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ కావడంతో చేవెళ్ల నుంచి తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో ఇదే జిల్లాలోని మరో పార్లమెంట్ స్థానం మాల్కాజ్‌గిరి నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఆసక్తికనబరుస్తున్నారు. ఇది జనరల్ స్థానం అయినప్పటికీ అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉండటంతో సర్వే సత్యనారాయణ ఇక్కడి నుంచి టికెట్ దక్కించుకున్నారు. అయినప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానంలో ఓడిపోవడమే కాకుండా శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోనె్మంట్ నుంచి ఓడిపోవడంతో ఈ సారి కొత్త వారికి అవకాశం ఇస్తుందన్న నమ్మకంతో ఆశావహులు ఢిల్లీ స్థాయిలో అధిష్టానంపై పావులు కదుపుతోన్నట్టు సమాచారం. పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా ఖమ్మం, మాల్కాజ్‌గిరి, నల్లగొండ నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తవారిని రంగంలోకి దింపుతేనే విజయవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోన్నట్టు పార్లమెంట్ ఎన్నికల వ్యూహం సమీక్షకు హాజరైన ఏఐసీసీ కార్యదర్శి ఒకరు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు.