రాష్ట్రీయం

కేటీఆర్ విరాళం రూ.25 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: కాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఆర్‌పీఎఫ్ కార్యాలయంలో కేటీఆర్ ఈ చెక్కును సీఆర్‌పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు అందజేశారు. అదేవిధంగా కేటీఆర్ స్నేహితులు కూడా మరో రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పుల్వామా ఉగ్ర దాడి తనను ఎంతగానో కలచి వేసిందని అన్నారు. కేవలం జవాన్ల వల్లే మనం క్షేమంగా ఉంటున్నామని ఆయన చెప్పారు. జవాన్ల ధైర్య సాహసాలతోనే దేశం సురక్షితంగా ఉంటున్నదన్నారు. అమర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని తెలిపారు. వారి త్యాగాలు ఎప్పటికీ జాతి గుండెల్లో నిలిచి పోతాయన్నారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొంతసేపు మాట్లాడారు.

చిత్రం.. సీఆర్‌పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు విరాళం చెక్కును అందిస్తున్న కేటీఆర్