రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరిదీ ఒక్కటే బాట అని పార్టీ నేతలకు కాంగ్రెస్ ఉద్భోదించింది. పార్లమెంట్ ఎన్నికలు రాహుల్‌గాంధీ, మోదీకి మధ్యనే జరుగనున్నాయనీ, రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో కాంగ్రెస్‌కే పట్టం కట్టాలని ప్రజలకు విడమరిచి చెప్పాలని పార్టీ నేతలకు ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు పిలుపునిచ్చారు. మూడు రోజులుగా హైదరాబాద్‌లో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై టీపీసీసీ సమన్వయ కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీలు సంయుక్తంగా నిర్వహించిన సమావేశాలు ఆదివారం ముగిసాయి. చివరి రోజు ఆదివారం చేవెళ్ల, మాల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఆర్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్ తదితరులు హాజరై ఎన్నికల వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొనే జరుగుతాయనీ, రాహుల్‌గాంధీ, మోదీకి మధ్యన జరిగే ఎన్నికలుగా ప్రజలకు విడమరిచి చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారనే శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీజేపీకి తెలంగాణలో బలం లేకపోవడంతో కేంద్రంలో బీజేపీ గెలిచినా ప్రయోజనం ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం కట్టాలన్నారు. టీఆర్‌ఎస్ బీజేపీ ముసుగులో ఉన్న పార్టీ అన్నారు. కేసీఆర్‌కు మోదీ అంటే భయం వల్లనే రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై పోరాడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసినా బీజేపీకి వేసినట్టేనని, ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి కాంగ్రెస్‌కు ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకరావాలన్నారు. దేశంలో మతతత్వ రాజకీయాలకు ఆజ్యం పోసి రాజకీయంగా లబ్ధి పొందాలన్నది బీజేపీ వ్యూహమన్నారు. ఈ వ్యూహాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చెక్కు చెదరలేదనడానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సేనన్న విధేయత ప్రజల్లో బలంగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికున్న అనేక కారణాలలో అధికార దుర్వినియోగం, ఈవీఎంలలో అక్రమాలు, ఓటర్ల తొలగింపు, డబ్బుల పంపిణీ ఉన్నాయన్నారు. అభ్యర్థుల ప్రకటనల్లో జాప్యం, పొత్తులు లేకుండా చూడాలని సమీక్షలో పాల్గొన్న నేతల అభిప్రాయంతో టీపీసీసీ, ఏఐసీసీ నేతలు ఏకీభవించారు. అభ్యర్థుల ప్రకటనలో జాప్యం ఉండకూడదనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల చివరి వారంలోనే అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
చిత్రం.. పార్లమెంట్ ఎన్నికల సమన్వయ సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడుతున్న
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి