రాష్ట్రీయం

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కలెక్టర్లను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి ఈ పథకం అమలుపై ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకానికి సంబంధించి మార్గదర్శకాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామంలో ప్రజల కోసం ప్రదర్శించాలన్నారు. తద్వారా ఆ గ్రామంలో ఎవరెవరికి లబ్ధి చేకూరిందో తెలుస్తుందన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం రైతు కుటుంబానికి ఏడాదికి 6వేల రూపాయలు చెల్లిస్తుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 9వేల రూపాయలు చెల్లిస్తుందన్నారు. తద్వారా కుటుంబానికి 15వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదించిన సమ్మాన్ నిధి పథకం పరిధిలో నమోదు కాని రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఇలాంటి రైతు కుటుంబాలకు 10వేల రూపాయలు అందజేస్తోందన్నారు. కేంద్రం రెండు హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉన్నవారికే దీన్ని వర్తింపజేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించామని, మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేశామన్నారు.
అధికారులకు ప్రత్యేక లాగిన్లు ఇచ్చామని, మొత్తం నగదు బదిలీ పారదర్శకంగా ఉంటుందన్నారు. ఆధార్ అనుసంధానిత చెల్లింపు వారథి ద్వారా నిర్వహిస్తామన్నారు. సోమవారం సాయంత్రం లోపు ప్రతి ఆధార్ అనుసంధానిత రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేయనున్నట్లు రాజశేఖర్ ప్రకటించారు.