రాష్ట్రీయం

మార్చి 12న ఎమ్మెల్సీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్చి నెలాఖరుతో పదవీకాలం ముగియనున్న శాసనమండలి స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నగారా మోగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఇరు రాష్ట్రాల్లోనూ మార్చి 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్న షెడ్యూల్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు సీఈసీ పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఫిబ్రవరి 21 నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమై 28న ముగుస్తుందని పేర్కొన్నారు. మార్చి ఒకటిన నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 5. 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కించి ఫలితాల ప్రకటన ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నిర్వహించే ఎన్నికల ప్రక్రియ మార్చి 15 నాటికి ముగుస్తుందని సీఈసీ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి పి నారాయణ, లక్ష్మీ శివకుమారి, పి శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావుల పదవీ కాలం కూడా మార్చి 29న ముగియనుంది. అలాగే తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, తిరువరగం సంతోష్‌కుమార్, మహ్మద్ సలీంల పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. రెండు రాష్ట్రాల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగగా, వీరి పదవీకాలం రాష్ట్ర విభజన తర్వాత ముగిసింది.

చిత్రాలు.. పి నారాయణ *లక్ష్మీ శివకుమారి *యనమల రామకృష్ణుడు *పి శమంతకమణి *ఆదిరెడ్డి అప్పారావు