రాష్ట్రీయం

నేటి నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ‘ప్రత్యేక హోదా..భరోసా’ పేరుతో బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రభుత్వాలు, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల వైఖరిని ఎండగడుతూ, వైఫల్యాలను ప్రజలకు నేతలు వివరించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను కలుపుతూ మార్చి 13 వరకు మొత్తం 25 పార్లమెంట్, 110 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర సాగనుంది. అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం మడకశిర నుంచి మంగళవారం ఎన్.రఘువీరారెడ్డి బస్సుయాత్ర చేపడతారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఊమెన్‌చాందీ, కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరమేశప్ప, ఆ రాష్ట్ర మంత్రి డీకే.శివకుమార్ బస్సుయాత్ర ప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటారు. యాత్ర సాగే అన్ని నియోజకవర్గాలు, మార్గమధ్యంలోని ఆయా నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య కూడళ్లలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈనెల 22న బస్సుయాత్ర తిరుపతికి చేరుకునే సందర్భంగా అక్కడ నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారు. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ఈనెల 19, 20 తేదీల్లో 380 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగనుంది. తొలిరోజు అనంతపురం జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ, మామిళ్లపల్లి, అనంతపురం రూరల్ మీదుగా యాత్ర సాగుతుంది. రాత్రికి నగరంలోహోటల్‌లో బస చేసి, మరుసటి రోజు కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతుంది. అనంతరం కడప, చిత్తూరు జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సు యాత్ర విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.