రాష్ట్రీయం

కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి క్యూఎస్ ఐగాజ్ పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: బెంగళూరు కేంద్రంగా ఉన్న క్యూఎస్ -ఈఆర్‌ఏ ప్రైవేట్ లిమిటెడ్ జాతీయ సంస్థ జాతీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ప్రకటించిన ర్యాంకుల్లో కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి బంగారు పతకం లభించింది. క్యూఎస్-ఈఆర్‌ఏ ప్రైవేట్ సంస్థ ప్రాథమిక ప్రాధాన్యత అంశంగా వైవీయూకు మొత్తం 1200 పా యింట్లు కేటాయించింది. ఇందులో బోధనలో నాణ్యత (్ఫ్యకల్టీ క్వాలిటీ), ఉద్యోగావకాశాలు, విద్యార్థుల వైవిధ్యం, వసతులు, సామాజిక బా ధ్యత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుం ది. ద్వితీయ ప్రాధాన్యతా అంశంగా 200 పాయింట్లు కేటాయించింది. ఇందులో కళలు, సంస్కృతి, బోధనలో వైవిధ్యత, పరిశోధన, కొత్త ఆలోచనలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇందులో 785 పాయింట్లు పొంది, యోగివేమన విశ్వవిద్యాలయం బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2018-19 విద్యాసంవత్సరంలో 7 విశ్వవిద్యాలయాలు దరఖాస్తు చేసుకోగా, వాటిలో యోగివేమన విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం పొందింది. రాష్ట్రంలోని పేరెన్నికగల విశ్వవిద్యాలయాల సరసన కొత్తగా ఏర్పాటైన వైవీయూ చేరడం పట్ల యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి అత్తిపల్లి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో బోధన, పరిశోధన ,పరిపాలన పరంగా జరుగుతున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. 2016 నుంచి 2019 సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని ఐగాజ్ సంస్థకు నివేదించామని తెలిపారు. ఈసమాచారాన్ని ఆ సంస్థ స్వతంత్రంగా అధ్యయనం చేసి నిర్దారణ చేసిన తర్వాత పతకాలను ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఐగాజ్ సంస్థకు సమాచారాన్ని అందించడంలో విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జయంత్ కశ్యప్, చంద్రశేఖర్ సమన్వయ పరిచారని తెలిపారు. యూనివర్సిటీలోని అందరి కృషి వల్లే ఈ పతకం లభించిందని వీసీ పేర్కొన్నారు.