రాష్ట్రీయం

మహా ర్యాలీకి నేతల బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 13న మహార్యాలీ నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్శిటీ విద్యార్ధులకు రాజకీయ పార్టీలు సైతం బాసటగా నిలిచాయి. ఈమేరకు వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్ ప్రతినిధులు శనివారం నాడు తమ మద్దతు ప్రకటించారు. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఘటనలపై జరిగిన నిజనిర్ధారణ కమిటీ తమ నివేదిక అంశాలను శనివారం మీడియాకు వివరించింది. రోహిత్ మరణానికి వైస్ ఛాన్సలర్ అప్పారావు కారణమని, సకాలంలో విసి సవ్యంగా స్పందించకపోవడం వల్లనే ఈ వివాదం చెలరేగిందని ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ నేతలు ప్రకటించారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం తదితరులు పాత్రికేయులకు నివేదిక అంశాలను చెప్పారు. మరో పక్క కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, టివివి ఉపాధ్యక్షుడు కె రాజేంద్ర ప్రసాద్, సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ, హెచ్‌సియు జాక్ నేత డి సుమన్, ప్రొఫెసర్ కెవై రత్నం సహా పలువురు నేతలు విసిని వెనక్కు పిలిపించాలని వేరే కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ప్రొఫెసర్లు, విద్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు కోరారు. హెచ్‌సియులో మోహరించిన పోలీసులను వెనక్కు రప్పించి యూనివర్శిటీలోకి అందర్నీ అనుమతించాలని డిమాండ్ చేశారు. 22న జరిగిన దమనకాండపై విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు రోహిత్ వేముల న్యాయపోరాట సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసినట్టు వారు చెప్పారు. ఈ నెల 5వ తేదీన ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు.
పోరాటానికి లక్ష చెక్కు
కేరళ స్టేట్ ముస్లిం యూత్ లీగ్ లక్ష రూపాయిల చెక్కును హెచ్‌సియు జాక్ నేతలకు అందజేసింది. కాగా, యూనివర్శిటీల్లో ప్రజాతంత్ర హక్కులను కాపాలని కోరుతూ 13న హైదరాబాద్‌లో మహార్యాలీ నిర్వహించాలని విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.

చిత్రం హైదరాబాద్‌లో శనివారం లక్ష రూపాయల చెక్కును హెచ్‌సియు జాక్ నేతలకు అందజేస్తున్న కేరళ స్టేట్ ముస్లిం యూత్ లీగ్ సభ్యులు