రాష్ట్రీయం

విశాఖలో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికగా రెండో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్టు వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు తెలిపారు. ఏయూ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజ్ఞాన భా రతితో కలిసి ఏయూ ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు రెండో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సదస్సును తూర్పుతీరంలోని విశాఖ నిర్వహించనున్నారన్నా రు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో నాలుగు టెక్నికల్ సదస్సులు, నాలుగు పేనల్ సెషన్స్, ఉంటాయన్నారు. అలాగే ప్రత్యేకంగా ఒక రోజు ఫిషర్‌మెన్ మీట్‌ను నిర్వహిస్తున్నారన్నారు. సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి ప్రతినిధులు, నిపుణులు హాజరుకానున్నారన్నారు. సదస్సులో 1000 మంది డెలిగేట్స్, 10 మంది అంతర్జాతీయ శాస్తవ్రేత్తలు, భారత్‌లో నిపుణులైన శాస్తవ్రేత్తలు పాల్గొంటారన్నారు. వేటలో అనుసరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, పద్దతులు, మత్స సంపద సృష్టి, పెరుగుదలపై నిపుణుల ప్రసంగాలుంటాయన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్‌కాయిస్ సంస్థ సహకారం అందిస్తుందని, సు మారు 250 మంది మత్స్యకారులు దీనిలో పా ల్గొంటారన్నారు. సదస్సులో భాగం గా చివరి రోజున స్టూడెంట్స్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. వివిధ కళాశాలల నుంచి 300 మంది విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే ఓషన్ సైన్స్ ఎక్స్‌పో ఉంటుందని, డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్, ఎన్‌ఐఓ, హిందుస్థాన్ షిప్‌యార్డ్, కొచ్చి షిప్‌యార్డ్‌ల నుంచి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. డీఆర్‌డీఓ చైర్మన్ సంతోష్‌రెడ్డి పాల్గొంటారన్నారు. సమావేశ మందిరం వద్ద షిఫ్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సదస్సు లో భాగంగా తీరప్రాంత పర్యాటకం, ఓషన్‌సైన్స్ టెక్నాలజీ, తదితర అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారన్నారు. సమావేశంలో వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొ ఫెసర్ కే నిరంజన్, విజ్ఞాన భారతి ఆర్గనైజింగ్ కార్యదర్శి జయంత్ సహస్రబుద్దే, ఆచార్య ఎస్‌ఎస్‌వీఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ ఆహ్వాన పత్రాన్ని విడుదల చేస్తున్న ఏయూ వీసీ ప్రొ. నాగేశ్వర రావు, చిత్రంలో విజ్ఞాన భారతి కార్యదర్శి జయంత్ సహస్రబుదే తదితరులు