రాష్ట్రీయం

తిరుపతి-తిరుమల మధ్య 80 ఎలక్ట్రికల్ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 18: తిరుపతి-తిరుమల మధ్య త్వరలోనే 80 ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతామని ఆర్టీసి ఎండి ఎన్‌వి సురేంద్రబాబు అన్నారు. సోమవారం తిరుపతికి విచ్చేసిన ఆయన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి చెంగల్ రెడ్డితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 13,100 కొత్త బస్సులు అవసరమని చెప్పారు. రూట్లలో ఆక్యుపెన్సీ 75శాతం ఉంటే అందుకు తగ్గట్టుగా బస్సులను నడపడానికి నిర్ణయిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో 1000 బస్సుల కొనుగోలుకు రూ. 250 కోట్లు అవసరం అవుతుందన్నారు. పాత బస్సులు, కండిషన్‌లో లేని వాటిని కలిపి మొత్తం 1600 బస్సులు రీప్లేస్ చేయాల్సి ఉంది. ఇందుకు దాదాపు రూ. 660 కోట్లు అవసరం అవుతుందన్నారు. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కనుక తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన చేయలేదని అయితే ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ అంశాన్ని పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. చిత్తూరు జిల్లాకు 197 కొత్త బస్సులు రానున్నాయని వివరించారు.
ఇందులో తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వీటి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో మరింతగా వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లను ప్రాధాన్యతా క్రమంలో ఏ,బీ,సీలుగా గుర్తించి వాటిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటునామన్నారు. ఇకపై తాము కొనుగోలు చేయనున్న కొత్త ఆర్టీసి బస్సుల్లో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంటూ ఆ దిశగానే టెండర్లను కూడా ఆహ్వానిస్తామన్నారు. సిబ్బంది పనితీరుతోనే ఆర్టీసి ఆదాయం పెరిగింది. కాని పెరిగిన డీజల్ ధరలతో ఆర్టీసీకి నష్టం వస్తోందన్నారు. దీనిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నాని ఆయన వివరిచారు. శ్రీవారి భక్తులకు సేవలందిస్తున్న ఆర్టీసికి కూడా టీటీడీ కమర్షియల్ దృష్టితోనే రుసుము వసూలు చేస్తోందని దీనిపై టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి సాధారణ స్థాయిలోనే ఆర్టీసీ స్థలాలకు రుసుము వసూలు చేయాలని కోరుతామన్నారు.
తిరుపతిలో అత్యాధునిక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం ఉచితంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటే తాము బస్‌స్టేషన్ నిర్మాణం ప్రారంభించడానికి వీలవుతుందని వివరించారు. తెలంగాణలోని ఆర్టీసి ఆస్తులకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆర్టీసి ఎండీ సందిస్తూ ఉమ్మడి ఆస్తులపై షీలా బీడే కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు.
మొత్తం 14 ఆస్తుల్లో వాటా రావాల్సి ఉండగా ఆరింటిలోరూ. 1200 కోట్లలో రూ. 850 కోట్ల ఆస్తుల పంపకానికి కమిటీ సైతం అమోదించిందని తెలిపారు. అయితే దీనిపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని నిర్ణయించుకోవాల్సి ఉంది.