రాష్ట్రీయం

మీ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: జాతీయ ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులు తెలంగాణలో మూడు రోజుల పర్యటన తర్వాత పరిస్థితి సానుకూలంగా మారినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 15 వ ఆర్థిక కమిషన్ చైర్మన్ నంద కిషోర్ సింగ్‌తో పాటు సభ్యులు డాక్టర్ అనూప్ సింగ్, డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ రమేష్ చంద్ సోమవారం హైదరాబాద్ వచ్చారు. కమిషన్ చైర్మన్, సభ్యుల వెంట అధికారులతో కలిపి మొత్తం 18 మంది ఉన్నారు. ఈ కమిషన్ పర్యటన తమలో ఉత్సాహాన్ని రేకెత్తించిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి మరొకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. వివిధ శాఖలు, రంగాలకు కలిపి ఏటా కనీసం 30 వేల కోట్ల రూపాయలైనా వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా ప్రభుత్వ వైఖరిని ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులకు వివరించారు. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించిన కమిషన్ సభ్యులు ఒకింత ఆశ్చర్య పోయారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే వేగంగా అభివృద్ధి చెందడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పరిపాలనలో చేపట్టిన సంస్కరణల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్న 10 జిల్లాలను విభజించి 33 జిల్లాలుగా మార్చడం వల్ల పరిపాలనలో వేగం కనిపిస్తుందని, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులంతా కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారైన ప్రతి గ్రామాన్ని తిరిగేందుకు అవకాశం లభించిందని, ప్రజల అవసరాలను వేగంగా తీర్చేందుకు వీలవుతోందని అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీల సంఖ్య, మున్సిపాలిటీల సంఖ్య పెంచడం వల్ల స్థానిక స్వపరిపాలనకు ఊతం ఇచ్చినట్టు అవుతోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నది కూడా కమిషన్ చైర్మన్, సభ్యులు పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోని అంశాలను యథాతథంగా తాము కేంద్రానికి సమర్పించే రిపోర్ట్‌లో చేరుస్తామన్నారు.
సోమవారం హైదరాబాద్ చేరిన ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులు అదే రోజు స్థానిక సంస్థల ప్రతినిధులతో, వివిధ రాజకీయ పార్టీలతో చర్చించారు. ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో మంగళవారం వారు సమగ్రంగా చర్చించారు. బుధవారం ఆర్థిక నిపుణులతో చర్చించారు. బుధవారం రాత్రి వారు ఢిల్లీ వెళ్లిపోయారు. ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులకు ప్రభుత్వ ఉన్నతాధికారులు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు.

చిత్రం.. గచ్చిబౌలి ఐఎస్‌బీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ ఎన్.కె సింగ్