రాష్ట్రీయం

2,04,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2019-20 సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఓట్-ఆన్- అకౌంట్ పేరుతో 2019-20 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శాసనసభలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రవేశపెడుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును మాత్రం ఆరు నెలలకోసం ప్రతిపాదిస్తున్నారు. శుక్రవారం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పేరుకే ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ అంటున్నారు తప్ప పూర్తిస్థాయిలోనే కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వేర్వేరు రంగాలకు లభించే ఆర్థిక సాయాన్ని పరిశీలించిన తర్వాత కొద్దిమార్పులతో జూన్ లేదా జూలై నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారని తెలిసింది. 2019-20 సంవత్సరానికి 2,04,000 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపొందించారని తెలిసింది. 2018-19 సంవత్సరానికి 1,74,453 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను గత ఏడాది ప్రతిపాదించారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో ఈ సంఖ్యలో స్వల్ప తేడాలు ఉంటాయని తెలుస్తోంది. శుక్రవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ శాఖలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగునీటి పారుదల ప్రాజెక్టులకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు, రైతుబంధు పథకానికి 15 వేల కోట్లు, రైతుబీమాకు వెయ్యి కోట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. సంక్షేమ పింఛన్ల కోసం 10 వేల కోట్ల రూపాయలు, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం కోసం 36 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారని తెలిసింది. విద్య, వైద్య రంగాలకు కూడా ఈ సారి 20 శాతం నుండి 30 శాతం వరకు బడ్జెట్‌ను పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి స్వయంగా వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించడం చాలా అరుదు. రోశయ్య సీఎంగా ఉండగా ఆర్థిక శాఖను తన వద్దనే ఉంచుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆర్థిక శాఖను తన వద్దనే ఉంచుకున్నారు.
గత ఐదేళ్లలో బడ్జెట్
ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి:

సంవత్సరం పూర్తిబడ్జెట్
(రూ.లు కోట్లలో)
2014-15 1,00,63
2015-16 1,15,689
2016-17 1,30,414
2017-18 1,49,446
2018-19 1,74,453