రాష్ట్రీయం

నిక్కచ్చిగా, నిజాయితీగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ‘మంత్రులుగా దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోపణలకు తావులేకుండా నిజాయితీగా, నిక్కచ్చితంగా వ్యవహరించండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, నిశితంగా పరిశీలించండి. మంత్రులమన్న అహంకారం ఏ కోశాన కనబర్చవద్దు. అందరిని కలుపుకొని సమన్వయంతో పని చేయండి’ అని మంత్రులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం చేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత గురువారం తొలిసారి జరిగిన మంత్రిమండలి సమావేశంలో మంత్రులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపాక, కొత్త మంత్రులకు సీఎం మార్గదర్శకం చేశారు. మంత్రి పదవి వచ్చిందని కనుక తామే గొప్పవారమనిగానీ, రానివారు తమ కంటే తక్కువన్న భావనగానీ, అహంకారం కానీ ఉండవద్దని సీఎం హితవు పలికారు. అందరికి మంత్రి పదవులు ఇవ్వలేం కనుక కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు, అవినీతికి తావు లేకుండా వ్యవహరించాలన్నారు. నిజాయితీగా, నిక్కచ్చితంగా ఉండాలన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఎంతటివారినైనా ఉపేక్షించనన్న విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో మీరే స్వయంగా చూసి ఉంటారని సీఎం గుర్తు చేసినట్టు తెలిసింది. మంత్రులకు మంచి పేరైనా, చెడ్డా పేరైనా వచ్చేది తమ వద్ద పని చేసే అధికారులే ప్రధాన కారణం అవుతుందన్నారు. పీఎస్‌లుగా, పీఏలుగా నియమించుకునే ముందు వారి గతాన్ని జాగ్రత్తంగా పరిశీలించండి. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని ఎట్టిపరిస్థితుల్లో నియమించుకోవద్దు, వారు చేసే తప్పులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దని సీఎం హెచ్చరించినట్టు తెలిసింది. మంత్రివర్గంలో స్థానం లభించని మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారని తెలిసింది. జిల్లాల్లో గ్రూపులు కట్టడం కానీ, ప్రోత్సహించడం కానీ చేస్తే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించినట్టు సమాచారం.