రాష్ట్రీయం

అభ్యర్థుల ఖరారుపై చంద్రబాబు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ఉండవల్లి ప్రజావేదికలో బుధ, గురువారాల్లో కడప జిల్లా నేతలతో రెండు సార్లు ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో కూడా తరువాత సమావేశమై అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలను సేకరించారు. రాజంపేట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్ రెడ్డి, రాయచోటి అభ్యర్థిగా రమేష్‌కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూషారెడ్డి, రైల్వే కోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహా ప్రసాద్ పేర్లను గురువారం ఖరారు చేశారు. తంబళ్లపల్లి, మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. తంబళ్లపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నియోజక వర్గ నేతలతో కూడా సమీక్ష నిర్వహించారు. మైదుకూరు టికెట్‌ను తనకు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రిని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. ఇదే సీటు కోసం టీటీడీ చైర్మ న్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా పట్టుబడుతున్నారు.