రాష్ట్రీయం

జనగామ రైల్వేస్టేషన్‌లో శాతవాహన హాల్టింగ్ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్: జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన మరిన్ని సేవలను కల్పించేందుకు రైల్వే ఉన్నత అధికారులతో త్వరలో చర్చించి కృషిచేస్తానని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూరనర్సయ్యగౌడ్ అన్నారు. శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గురువారం జనగామ స్టేషన్‌లో ఎంపీ బూరనర్సయ్యగౌడ్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు జెండాలు ఊపి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఎంపీ బూరనర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తన పార్లమెంట్ నియోజకవర్గంలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలపై తనకు ఎనలేని ప్రేమ, గౌరవాలు ఉంటాయని అన్నారు. ఈ ప్రాంతం నుండి ఎవరైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా కృషిచేస్తున్నామని అన్నారు. ప్రధానంగా రైల్వే ప్రయాణికులు అనేక సార్లు స్థానిక రైల్వే స్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇప్పించాలని కోరిన నేపధ్యంలో ఉన్నతాధికారులతో చర్చిస్తే వారు ఈ అవకాశం కల్పించారని అన్నారు. విజయవాడ నుండి బయల్దేరే శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10:15గంటలకు జనగామ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని, సికింద్రబాద్ నుండి సాయంత్రం తిరిగివచ్చే శాతవాహన ఎక్స్‌ప్రెస్ 5:15నిమిషాలకు స్థానిక రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌కు అనుమతులు ఇచ్చారని అన్నారు. ఈ సమయం ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జనగామ రైల్వేస్టేషన్‌లో కోచ్ డిస్ప్లే ఏర్పాటు చేసేందుకు కావాల్సిన రూ. 40లక్షలు మంజూరు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపించారని అన్నారు.

చిత్రం.. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు
జనగామ స్టేషన్‌లో జెండాలు ఊపి స్వాగతం పలుకుతున్న ఎంపీ బూరనర్సయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి