రాష్ట్రీయం

నేటినుంచి పెద్దగట్టు జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 23: తెలంగాణలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర ఆదివారం రాత్రి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలనుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఇరవై లక్షలమందికి పైగా భక్తులు ఈ జాతరకు తరలిరానున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర రాష్ట్ర, జిల్లా ఏర్పాటు తర్వాత తర్వాత మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. జాతర ఆదివారం నుంచి ప్రారంభమై ఈనెల 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. 24వ తేదీ రాత్రి నుండి జాతర ఆరంభం కానుంది. 25వ తేదీన సోమవారం రోజున జాతరలో కీలకఘట్టంగా భావిస్తారు. తెల్లవారుజామున జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు పసుపు, కుంకుమలతో బోనాన్ని అందంగా అలంకరించి బోనాలతో పాటు గంపలతో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి లింగమంతుల స్వామికి, చౌడమ్మ అమ్మవార్లకు తమ మొక్కులు తీర్చుకుంటారు. 25తేదీ మంగళవారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం నిమ్మకాయలు, ఖార్జురపండ్లు, పసుపు, కుంకుమలతో చంద్రపట్నం వేస్తారు. 27వ తేదీ బుధవారం రోజున స్వామివారు, అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి పాలతో అభిషేకించి నెలవారం పండుగను చేస్తారు. రాత్రి కేసారం గ్రామ యాదవులు అందనం చౌడమ్మ పెట్టెను కేసారం గ్రామానికి తరలిస్తారు. 28 గురువారం రోజున స్వామివారి మకర తోరణం, ఉత్సవ విగ్రహాలను సూర్యాపేట, కాశీంపేటలకు తరలించడంతో నాలుగురోజుల పాటు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడిన పెద్దగట్టు జాతర పరిసమాప్తమవుతోంది. ఈ సారి జాతరకు ప్రభుత్వం రూ.1.70కోట్ల నిథులను కేటాయించడంతో జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా గుట్టకింద భాగంలోని కోనేరులో శివుని విగ్రహాన్ని ప్రతిష్టించి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలువ పందిళ్లు, విద్యుత్ లైన్‌ల నిర్మాణాలను పూర్తిచేసి జాతరకు అధికారులు సర్వసిద్ధం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 1200మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. జిల్లా కలెక్టర్ డి.అమయ్‌కుమార్ శనివారం పెద్దగట్టను సందర్శించి జాతర ఏర్పాట్లను సమీక్షించారు.