రాష్ట్రీయం

మాజీ ఎమ్మెల్యే బాల్‌రెడ్డి కన్నుమూత నేతల నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి (73) తీవ్ర అస్వస్థతతో శనివారం సా యంత్రం కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆ రోగ్యం క్షీణించి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరి, అప్పటి నుండి చికిత్స పొందుతూ శనివారం నా డు కన్నుమూశా రు. బాల్‌రెడ్డి మృతి పట్ల బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపా న్ని వ్యక్తం చేశారు. బాల్‌రెడ్డి పార్థీవ దేహా న్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ వారి నివాసంలో ఉంచి అక్కడి నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఒంటి గంటకు తీసుకువాస్తిరు. రెండు గంటల వరకూ పార్టీ అభిమానులు, ప్రజ ల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం విస్పర్ వాలీలోని మహాప్రస్థానానికి అంతి మ యా త్ర జరుగుతుంది. బాల్‌రెడ్డి కా ర్వాన్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర మా జీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, పార్టీ నేతలు ఎన్ ఇంద్రసేనారెడ్డి, జీ కిషన్‌రెడ్డి, ముఖ్యమం త్రి కే చంద్రశేఖరరావు వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాల్‌రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని మురళీధరరావు పేర్కొన్నారు. బా ల్యం నుండి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేశారని, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా జన తా పార్టీ, బీజేపీలోనూ కీలకమైన బాధ్యతలు నిర్వహించారని అన్నారు. బాల్‌రెడ్డి పాతబస్తీ ప్రజలకు గోల్కొండ సింహంగా సుపరిచితులని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బాల్‌రెడ్డి మృతికి సంతాపంగా బీసీల ఆత్మగౌరవ సభను వాయిదా వేసుకుంటున్నట్టు ఓబీసీ మోర్చా నేతలు కాటం నరసింహ యాదవ్, వినోద్ యాదవ్‌లు తెలిపారు.