రాష్ట్రీయం

సైబర్ నేరగాళ్ల ఆటలను అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్ర రాష్ట్రంలో సైబర్, ఆర్ధిక నేరాలపై ఉక్కుపాదం మోపుతామని, టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ఘరానా మోసాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాష్ట్ర డిజిపి జెవి రాముడు హెచ్చరించారు. సైబర్ నేరాలను అరికట్టే ముందు రాష్ట్రంలోని పోలీసు కానిస్టేబుళ్ల మొదలుకుని ఉన్నత పోలీసు అధికారుల వరకు సైబర్ నేరాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండేందుకు విస్తృత స్ధాయిలో శిక్షణ ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆధారిత నేరాలే పెనుసవాళ్లు విసురుతాయని ఆయన అన్నారు. బుధవారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిఐడి కార్యాలయంలో సైబర్ క్రైమ్స్ విభాగం కేడెట్ ఎస్సైలకు నిర్వహిస్తున్న నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి జెవి రాముడు మాట్లాడుతూ ఆంధ్రాలో భవిష్యత్తులో పోలీసు వ్యవస్ధకు ఎదురయ్యే సైబర్ నేరాలను అరికట్టేందుకు ఒక బృహత్తర కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
ఈ నేరాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు పోలీసులు సమాయత్తం కావాలన్నారు. కొత్తగా శిక్షణలో చేరిన అధికారులందరికీ సైబర్ నేరాలపై అవగాహన, పరిశోధన నైపుణ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక మాద్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటివి వేదికగా జరుగుతున్న వేధింపులు, నేరాలపై అవగాహన, పరిశోధన కూడా ఈ శిక్షణలో భాగంగా చేశామన్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్ వంటి సాధనాలు వాడి ఏదైనా నేరం చేసినప్పుడు ఆధారాలు ముఖ్యమని, వీటిని సేకరించి భద్రపరచాలన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎటువంటి తడబాటులేకుండా సైబర్ నేరాలను పరిశోధించేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.
యువ అధికారులు పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దీని గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆర్ధిక నేరగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు. వీరి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. రాజకీయాలతో సంబంధంలేకుండా ఆర్ధిక, అటవీ సంపదను దొంగిలించే నేరగాళ్ల కదలికలపై డేగ కన్ను వేసి ఉంచాలని, వీరిని పట్టుకుని చట్టం ముందు బోనులో నిలబెట్టాలన్నారు. ఆర్ధిక, సైబర్ నేరగాళ్ల విషయంలో ఆధారాలు భద్రపరచడం ముఖ్యమని ఆయన హితవు చెప్పారు. ఆర్ధిక, సైబర్ నేరాల తీరును సిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఐజి పివి సునీల్ కుమార్, శిక్షణ విభాగం ఐజి అతుల్ సింగ్, ఎస్‌పి కాంతి రతన్ టాటా పాల్గొన్నారు.