రాష్ట్రీయం

గ్రూప్-2 పరీక్ష వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణను నిలిపివేసినట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ వెల్లడించారు. ఈ పరీక్షను షెడ్యూలు ప్రకారం ఈ నెల 24,25 తేదీల్లో నిర్వహించాల్సి ఉందని, అయితే రాష్ట్రప్రభుత్వ సూచన మేరకు దీనిని వాయిదా వేస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రస్తుతం 439 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేశామని, రానున్న రోజుల్లో పోస్టుల సంఖ్య పెరగవచ్చని అన్నారు. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు 19, ఎసిటిఓ పోస్టులు 110, సబ్ రిజిస్ట్రార్ పోస్టులు 23, ఎక్స్‌టన్షన్ ఆఫీసర్ పోస్టులు 67, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇనస్పెక్టర్లు 220 పోస్టులు ఉన్నాయని ఆమె వివరించారు. 675 మార్కులు గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని చెప్పారు. పేపర్-1 జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీస్, పేపర్-2 హిస్టరీ, పాలిటి, సొసైటీ, పేపర్-3 ఎకానమి డెవలప్‌మెంట్, పేపర్-4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఉంటుందని ఈ నాలుగు పేపర్లకు 150 చొప్పున 600 మార్కులకు, ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్ కింద వెబ్‌పోర్టల్‌లో పేర్లను నమోదుచేసుకున్న వారి సంఖ్య 10,04,427కు చేరుకుందని ఆమె చెప్పారు.