రాష్ట్రీయం

తెలంగాణకు 29.. ఆంధ్రకు 17.5 టీఎంసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: వేసవి అవసరాలకు వాడుకోవడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 29 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17.5 టీఎంసీలు కేటాయించినట్టు బోర్డు చైర్మన్ ఆర్‌కే జైన్ ప్రకటించారు. జలసౌధలో గురువారం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. బోర్డు చైర్మన్ ఆరెకే జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా, తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్‌రావుతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల నుంచి బోర్డుకు వచ్చిన ప్రతిపాదనలపై సమావేశం చర్చించింది. వేసవి అవసరాలకు తక్షణం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్ 17.5 టీఎంసీలు తెలంగాణ 29 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు చైర్మన్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేటాయించిన నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగించుకున్నప్పటికీ, తాము వినియోగించుకోకపోవడంతో ఎక్కువ నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించబోతున్నట్టు బోర్డు వివరించింది. కేటాయించిన నీటిని మే నెలాఖరులోగా వాడుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. గతంలో కేటాయించిన నీటిని వాడుకోకపోతే దానికి బోర్డు బాధ్యత వహించదని ఇక ముందు అలా జరుగకుండా విధించిన గడువులోగానే నీటిని వినియోగించుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. గతంలో కేటాయించిన నీటి కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగించుకుందని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన అంశంపై చర్చ జరిగింది. తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకున్నామని, ఎక్కువ వాడుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనలో వాస్తవం లేదని తెలంగాణ ఇ-ఎన్-సి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకున్నది టెలీ మీటర్ల ద్వారా లెక్క తేల్చాలి తప్ప అశాస్ర్తియంగా కాకి లెక్కలతో ఫిర్యాదు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇఎన్‌సీల మధ్య పరస్పర వాగ్వాదం జరిగినట్టు అధికార వర్గాల సమాచారం.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న కృష్ణా బోర్డు చైర్మన్ ఆరెకే జైన్