రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిసి 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ‘కారు’ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. పాలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసమేనంటూ ఆయన గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. అవసరమైతే తన శాసనసభత్వానికి రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకూ సిద్ధమేనని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇలాఉండగా ఉపేందర్ రెడ్డి గురువారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును కలిసి చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు ఇస్తామన్న హామీని కూడా ఆయన పొందినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావును ఉపేందర్ రెడ్డి ఓడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌కు వలసలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఫిరాయింపుల కుదుపుకు గురవుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, తాజాగా పి. సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉపేందర్ రెడ్డి కూడా సంసిద్ధతను తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందగా, వారిలో ఒక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
టీఆర్‌ఎస్ వైపు నేతల చూపు
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఘోర పరాభవం పాలైనప్పటికీ, తరువాత గెలిచిన శాసన సభ్యులు ఒకొక్కరుగా ఆ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది శాసనసభ స్థానాలు ఉండగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేవలం ఖమ్మం స్థానంలో మాత్రమే విజయం సాధించగా వైరాలో స్వతంత్ర అభ్యర్థి, సత్తుపల్లి, అశ్వారావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పాలేరు, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, మధిర, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్కరు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతుండగా గురువారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. రాష్టమ్రంతా టీఆర్‌ఎస్ గాలి వీచినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం టీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు రాలేదు. పార్టీ నేతల మధ్య వర్గ విభేదాల వల్లే ఖమ్మం జిల్లాలో పార్టీ ఓటమి పాలైందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో పార్టీ ఓటమి ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశను నింపగా తిరిగి పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా భుజానికి ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేయగా ఆ తరువాత సత్తుపల్లిలో గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, ఇల్లెందులో గెలిచిన హరిప్రియనాయక్ అదే బాటలో నడిచారు. వీరందరికంటే ముందే వైరాలో గెలిచిన రాములునాయక్ టీఆర్‌ఎస్‌లోకి చేరిపోయారు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో ఎన్నికల్లో గెలిచిన పువ్వాడ అజయ్‌తో పాటు ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లోగానే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన పినపాక, సత్తుపల్లి, ఇల్లెందు, పాలేరు ఎమ్మెల్యేలతో కలిపి ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు ఉన్నట్లవుతున్నది. ఖమ్మం జిల్లానే టార్గెట్ చేస్తూ కేసీఆర్ వేసిన ఎత్తుగడలు సత్ఫలితాన్నిచ్చినట్లయింది. మిగిలిన నలుగురు శాసన సభ్యుల్లో మరో ఇద్దరు కూడా చేరనున్నట్లు సమాచారం.

చిత్రం.. కేటీఆర్‌ను కలిసిన పాలేరు ఎమ్మెల్యే