రాష్ట్రీయం

నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, మార్చి 14: మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిని మహేశ్వరం ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రా రెడ్డి, ఆమె కుమారుడు పీ.కార్తీక్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మహేశ్వరం నుంచి పోటీ చేసి సబితా రెడ్డి గెలిచారు. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని అతని నివాసంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అభివృద్ధి, సంక్షేమం కోసమే పార్టీ మారుతున్నాని, నియోజకవర్గం అభివృద్ధే తనకు ముఖ్యమన్నట్లు పేర్కొన్నట్లు తెలస్తోంది. టీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోతానని తెలిపినట్లు విశ్వాసనీయ సమచారం. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బేర బాలకిషన్ పాల్గొన్నారు.

చిత్రం.. తీగల నివాసంలో సబితా రెడ్డి, కార్తీక్ రెడ్డి