రాష్ట్రీయం

ఓటడిగే హక్కు మాకే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: రాష్ట్రంలో లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిన తమకు మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరులో బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన ‘ఎన్నికల సన్నాహాక సమావేశం’లో ఆయన మాట్లాడుతూ 2014 నాటికి రూ.200 ఉన్న సామాజిక పింఛన్ రూ.2 వేలకు పెంచామని, రూ.18,600 కోట్లు పసుపు- కుంకుమ కింద మహిళలకు అందచేశామని తెలిపారు. అయితే జగన్ మాత్రం పసుపు- కుంకుమ తొలగించే పనిలో ఉన్నారని ఆరోపించారు. స్వయానా తన బాబాయి హత్యకు గురైతే మధ్యాహ్నం వరకు గుండెపోటంటూ చెప్పుకొచ్చి, మధ్యాహ్నం తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో హత్య చేశారని ఆ హత్యానేరాన్ని తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వచ్చేలోగా సాక్ష్యాలను ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చిందో తెలపాలని ప్రశ్నించారు. అక్కడి వైసీపీ ఎంపీ అభ్యర్థి కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం టీడీపీకి లేదని, తాము అభివృద్ధి తరహా రాజకీయాలు మాత్రమే చేస్తామన్నారు.
పోలవరం అడ్డుకునేందుకు కుట్ర
రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని, అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. అటువంటి కేసీఆర్‌తో కలిసిన జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రాకు ఎటువంటి న్యాయం చేయగలరో ప్రజలే ఆలోచించాలని సూచించారు. పోలవరం, ప్రత్యేక హోదాలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌తో జగన్ స్నేహం చేశారని, ఆ ఇద్దరికి ప్రధాని మోదీ జతయ్యారని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ కేసుల నుండి ప్రధాని కాపాడుతున్నారని ఆరోపించారు. ధనిక రాష్టమ్రైన తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. తన ప్రాణమున్నంత వరకూ రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు సాగనివ్వనని స్పష్టం చేశారు. ఆంధ్రులను రాక్షసులని, ఇక్కడి వంటకాలను పేడతో పోల్చిన కేసీఆర్‌కు వంతపాడే నాయకుల సంగతి ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారని తేల్చి చెప్పారు. ముసుగులో గుద్దులాటలు మానుకొని దమ్ముంటే ముగ్గురు మోదీలు ఒక్కటిగా ఆంధ్రాలో పోటీ చేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. మరోవైపు బిహార్‌కు చెందిన వ్యక్తి తెలివితేటలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, తెలుగుదేశం ఓట్లను తొలగించే ప్రక్రియలు చేపట్టారని, వారి తెలివితేటలు ఇక్కడ సాగవని పరోక్షంగా ప్రశాంత్ కిషోర్‌ను ఉద్దేశించి అన్నారు.
రాజీపడిన మాట వాస్తవమే
అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని స్థానాల్లో తాను రాజీపడిన మాట వాస్తవమేనని చంద్రబాబు తెలిపారు. ఒకటికి నాలుగుసార్లు సర్వేలు నిర్వహించి, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేశానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల తప్పనిసరై సమర్ధులకు అవకాశం కల్పించడం కోసం పార్టీలోని ముఖ్యులకు సీట్లు కేటాయించ లేకపోయానని ఒప్పుకున్నారు. అయితే పార్టీ కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ తగిన గుర్తింపు కచ్చితంగా ఇస్తానని హామీనిచ్చారు. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బతికేదే కార్యకర్తల త్యాగాల వల్లని, వారు లేకుంటే పార్టీకి మనుగడ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో సుమారు రూ.5వేల కోట్ల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గూడూరు డివిజన్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ చెంచలబాబు యాదవ్ తదితరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నెల్లూరు, తిరుపతి లోక్‌సభ అభ్యర్థులు బీద మస్తాన్‌రావు, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.