రాష్ట్రీయం

దేశ దశ, దిశలను కేసీఆర్ మార్చేస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: టీఆర్‌ఎస్ నుంచి 16 మంది ఎంపీలను గెలిపిస్తే, సీఎం కేసీఆర్ ఈ దేశానికి దశ, దిశలను మారుస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ సదవకాశాన్ని తెలంగాణ ప్రజలు చేజార్చుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఎంపీలనే గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం వికారాబాద్, భూపాలపల్లి, సికింద్రాబాద్ కంటోనె్నంట్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, శ్రేణులు కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికే ఆచరణీయయోగ్యంగా, మార్గదర్శకంగా మారాయని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆలోచనలోంచి రూపుదిద్దుకున్న రైతుబంధు పథకానే్న కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రధాని మోదీకిగానీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకిగానీ రైతుబంధు వంటి ఆలోచనలు ఎందుకు రావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నుంచి 16 మంది ఎంపీలను గెలిపిస్తే అది అక్కడితో ఆగిపోదని, ఢిల్లీలో తమతో మరో 116 మంది ఎంపీలు జతకట్టడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, 16 సీట్లు గెలిస్తే సాధించలేనిది ఏమైనా ఉంటుందా? అని కేటీఆర్ అడిగారు. దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు లేని చోటనే జాతీయ పార్టీలకు మనుగడ సాగిస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు రెండు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీకి 150, కాంగ్రెస్‌కు 100 కంటే ఎక్కువ సంఖ్యలో ఎంపీలు గెలిచే పరిస్థితిలేదన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, జాతీయ వౌలికాంశాలపై కేసీఆర్ లేవనెత్తిన వాటికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదని అన్నారు. నేతలు పార్టీలు మారడం పట్ల విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. పార్టీలు మారడం ఇప్పుడే కొత్త అయినట్టు గగ్గోలు పెడుతున్నారన్నారు. బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు అమిత్ షా కండువాలు కప్పుతుంటే వాటి గురించి ఎందుకు మాట్లాడం లేదని నిలదీశారు కేటీఆర్ ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను వారు చేర్చుకున్నప్పుడు అప్రజాస్వామికం అనేది గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తమ చేవెళ్ల ఎంపీకి రాహుల్ గాంధీ కండువా కప్పిప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పట్ల ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. తమ పార్టీల నుంచి వలసలు ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నాయకత్వ లోపం వల్లే పార్టీలు మారుతున్నారనే సోయి లేకనే తమను ఆడిపోసుకుంటున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిందేమిటో చెప్పకుండా కేసీఆర్‌ను తిట్టడమే ప్రచారంగా ఎంచుకున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా గద్దె దిగడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబును తిరస్కరించే సమయం కోసం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు మించిన పచ్చి అవకాశవాది మరొకరు లేరన్నారు. భవిష్యత్‌లో మళ్లీ మోదీతో కలువబోనని దమ్ముంటే చంద్రబాబు ప్రకటించగలరా? అని కేటీఆర్ సవాలు విసిరారు.
చిత్రం.. కేటీఆర్