రాష్ట్రీయం

మల్కాజిగిరిలో మద్దతు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న నాకు మద్దతు ఇవ్వండి’ అని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోరారు. సోమవారం తార్నాకలోని కోదండరామ్ నివాసానికి వెళ్లిన ఆయన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఇరువురూ తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సమావేశానంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో మద్దతునివ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి తనను కోరారని చెప్పారు. అయితే, ఈ విషయంలో తాను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయనకు తెలిపానని అన్నారు. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించిన కోదండరామ్ మద్దతు కోరాననీ, అదే విధంగా ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నానని చెప్పారు. మజ్లిస్ ఎంపీ మద్దతుతో పాటు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన వారితో కలిపి మొత్తం 16 మంది ఎంపీలు 60 నెలలుగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లోగడ కేంద్రంలో యుపీఏ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలోనూ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను యుపీఏ పొందుపరచడం జరిగిందన్నారు. ఆ హామీలన్నీ అమలు కావాలంటే కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉంటుందని అన్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీని స్థాపిస్తామని చెప్పడం గురించి ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీని నెలకొల్పితే ఫలితం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్