రాష్ట్రీయం

భీమవరం, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 19: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయనున్నారు. 21న గాజువాకలో 22న భీమవరంలో నామినేషన్ వేస్తారు. పార్టీ జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వే ఫలితంగా, వారి సూచన మేరకు పవన్‌కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధిలోని గాజువాక అసెంబ్లీ స్థానాలకు పోటీలో నిలవనున్నట్లు ప్రకటించారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిపేందుకు నిర్ణయించారు. ఇక విశాఖ ఉత్తరం నుండి పసుపులేటి ఉషా కిరణ్, విశాఖ దక్షిణం నుండి గంపల గిరిధర్, భీమిలి నుండి పంచకర్ల సందీప్, అమలాపురం నుండి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుండి తుమ్మల రామస్వామి, పోలవరం నుండి చిర్రి బాలరాజు, అనంతపురం నుండి టీసీ వరుణ్‌ను అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు నియోజవర్గాల్లో పోటీలో నిలిచేందుకు నిర్ణయించారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో అని ఎదురు చూసిన ఆయన అభిమానులకు ఉత్సాహ పరిచేందుకు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ మంగళవారం తెలిపారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, రాయలసీమలో అనంతపురం నుండి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు. అయితే అక్కడ అన్ని విధాలా బలంగా ఉన్నా, ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాల్లో ఎలక్షనీరింగ్‌కు అవసరమైన వ్యవస్థను సిద్ధపరిచేందుకు సమయం స్వల్పంగా ఉందని జనరల్ బాడీ అభిప్రాయపడింది. తిరుపతి నుండి పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడగా చిరంజీవి గెలిచిన స్థానం కావడం, అక్కడి నుండి గెలిచినా తిరుపతిని కుటుంబ స్థానంగా మార్చినట్లు అవుతుందేమో అని జనవరల్ బాడీ పవన్‌కు సూచించింది. వీటితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోటీ అంశాలను ఆయనుకు సూచించిన నేపథ్యంలో గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించారు. సినీ జీవితాన్ని ప్రారంభించే ముందు నటనలో ఓనమాలు చేర్చుకున్నది విశాఖ ప్రాంతమే అని ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి అంకురార్పణ చేస్తున్నదీ విశాఖ కూడా కావడం సంతోషంగా ఉందని పవన్‌కళ్యాణ్ తెలిపారు. అలాగే పాఠ్య పుస్తకాలు వదిలి, సమాజాన్ని చదవడం మొదలు పెట్టింది కూడా భీమవరం లోనే అని పవన్ తెలిపారు. చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది కూడా భీమవరంలోనే అని నాటి జ్ఞాపకాలను నెమరుసుకున్నారు. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన భీమవరం నుండే ప్రారంభించాలని అని పవన్ జనసైనికులకు సూచించారు.
విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ
విశాఖపట్నం పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ నిర్ణయించారు. ఇటీవల పార్టీలో చేరిన లక్ష్మీనారాయణను పార్లమెంట్‌కు పంపించాలనే అలోచనలతో ఆయనకు ఉత్తరాంధ్రలోని విశాఖ నుండి పోటీకి నిలిపితే మంచిదని భావించి ఆయనకు ఆ స్థానం కేటాయించారు. లక్ష్మీనారాయణ తోడల్లుడు, అనేక విశ్వవిద్యాలయాకు ఉపకులపతిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన రాజగోపాల్‌కు పార్టీలో కీలక బాధ్యతలను ఇచ్చేందుకు పవన్‌కళ్యాణ్ నిర్ణయించారు. ముందుగా అనంతపురం శాసనసభ స్థానం నుండి రాజగోపాల్ పోటీలో నిలపాలని నిర్ణయించినప్పటికీ, ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్‌ను అనంతపురం పార్లమెంట్ బరిలో నుండి పోటీ చేయాలని పవన్ సూచించారు. శాసనసభ స్థానాన్ని టీసీ వరుణ్‌కు కేటాయించడానికి సమ్మతించిన రాజగోపాల్ పార్టీ బాధ్యతలను నిర్వర్తించేందుకు మొగ్గు చూపారు. దీంతో పార్టీలో ఉన్నతమైన ఒక కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.
జనసేన మరో జాబితా
జనసేన పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులతో మరో జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. ఒంగోలు లోక్‌సభ జనసేన పార్టీ అధ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబును పార్టీ ప్రకటించింది. అసెంబ్లీ అభ్యర్థులు: టెక్కలి -కణితి కిరణ్‌కుమార్, పాలకొల్లు -గుణ్ణం నాగబాబు, గుంటూరు ఈస్ట్- షేక్ జియా ఉర్ రెహ్మాన్, రేపల్లె -కమతం సాంబశివరావును, చిలకలూరిపేట -మిరియాల రత్నకుమారి, బాపట్ల - కె రమాదేవి, ఒంగోలు -షేక్ రియాజ్, మార్కాపురం -ఇమ్మడి కాశీనాథ్, గిద్దలూరు -బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్, పొద్దుటూరు -ఇంజా సోమశేఖర్‌రెడ్డి, నెల్లూరు అర్బన్ -కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, మైదుకూరు -పందిటి మల్హోత్ర, కదిరి -సాడగల రవికుమార్. గిద్దులూరు స్థానం నుండి ముందుగా ప్రకటించిన షేక్ రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుండి బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేయనున్నట్లు అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.