రాష్ట్రీయం

విశాఖలో కోటి నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, మార్చి 19: విశాఖ జిల్లా సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం పాత రోడ్డు చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న కారులో తరలిస్తున్న కోటి రూపాయల నగదును స్థానిక పోలీసులు, ఎన్నికల సంఘం నియమించిన స్టేటస్టికల్ సర్వవైల్ టీమ్ అధికారి షేక్ బాబూరావు పట్టుకున్నారు. నగదును ఎక్కడికి తరలిస్తున్నారని డ్రైవర్ మాణిక్యాలరావు, బ్యాంక్ అధికారి మల్లేశ్వరరావును తనిఖీ అధికారులు ప్రశ్నించగా విశాఖలోని సీతంపేట ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ (చెస్ట్‌బ్యాంకు) నుంచి పాడేరులోని ఏపీజీవీబీకి తీసుకెళ్తున్నామన్నారు. అయితే నిబంధనల ప్రకారం సెక్యూరిటీ లేకపోవటం, నగదు తరలింపునకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటం, అన్నింటికంటే అద్దెకారుపై ఒక పార్టీ లోగో స్టిక్కరింగ్ చేసి ఉండటంతో అధికారులు అనుమానించారు. దీంతో ఆ కారును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి ట్రంక్ పెట్టెలో ఉన్న కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. డ్రైవరు, అకౌంటెంట్లను అదుపులోకి తీసుకున్నారు. సమాచారాన్ని స్థానిక ఏపీజీవీబీ, విశాఖ సీతంపేట బ్రాంచికి చేరటంతో ఆ బ్యాంకు ఉన్నతాధికారులు ఇక్కడి సీఐ, ఎస్‌ఐలను కలిసి తమ చెస్ట్‌బ్యాంకు నుంచి పాడేరు బ్రాంచికి తరలిస్తున్నామని, కానీ అందుకు సరైన పత్రాలు అద్దెకారులో ఉంచలేకపోయామని అంగీకరించారు. దీంతో ఎన్నికల సంఘం ఎస్‌ఎస్‌టీ అధికారుల నిబంధనల ప్రకారం నగదును ట్రజరీకీ స్వాధీనం చేస్తామని, కేసును పెందుర్తి అసెంబ్లీ సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, స్థానిక తహశీల్దార్ కె.రమాదేవికి ట్రాన్స్‌ఫర్ చేస్తామని సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అయితే తమకు దొరికిన నగదు కోటి రూపాయలకు సంబంధించి బ్యాంక్ అధికారులు, పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ట్రజరీకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తహశీల్దారు ఈ విషయం తీసుకువెళ్ళిన తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఐ ఎన్.ప్రభాకరరెడ్డి, సిబ్బంది, ఎస్‌ఎస్‌టి అధికారి షేక్ బాబూరావు,ఈవోపీఆర్డీ కె.సూర్యనారాయణ పాల్గొన్నారు.
రూ. 4 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం
కార్వేటినగరం: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట చెక్‌పోస్ట్ వద్ద రూ. 4 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి నేపథ్యంలో కొల్లాగుంట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో రూ. 4కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని, వీటిలో 12 కిలోల బంగారు ఆభరణాలు, 60 వజ్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చెన్నై నుంచి మలబార్ బంగారు దుకాణం ఆభరణాలకు సంబంధించిన నగలుగా గుర్తించామన్నారు. ఈ నగలు చెన్నై నుంచి తిరుపతిలో 13 దుకాణాలకు, నెల్లూరులో 10 దుకాణాలకు సరఫరా చేయడానికి తీసుకువెళుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వీటి విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. బంగారు ఆభరణాలను సీజ్‌చేసి చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలావుండగా మదనపల్లె నుంచి పలమనేరు వైపు కారులో ప్రయాణిస్తున్న నలుగురి వద్ద రూ.2.15 లక్షల నగదు ఈవోఆర్డీ, ఎస్సై అరుణ్‌కుమార్‌రెడ్డి పట్టుకున్నారు.

చిత్రం.. కారు నుంచి నగదు ఉన్న పెట్టెను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు