రాష్ట్రీయం

దమ్ముంటే నాపై పోటీ చెయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ వనస్థలిపురం, మార్చి 19: ప్రతిపక్షం లేకుండా చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్‌కు దమ్ముంటే తనపై మల్కాజిగిరిలో పోటీ చేయాలని పీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యాలయాన్ని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని చంద్రపురి కాలనీలో ప్రారంభించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాటి నుంచి నేటివరకు ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ ప్రభుత్వాలను కొనసాగించాయా? అని గుర్తు చేశారు. ప్రజలకు న్యాయం జరగాలంటే చట్టసభలలో ప్రశ్నించే గొంతులు ఉండాలని, కానీ, తెలంగాణలో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలనను నడిపిస్తున్నాడని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో ప్రమాదకరమని చెప్పారు. పార్లమెంట్ బరిలో పోటీ చేయాల్సిన అభ్యర్థులకు అత్యున్నతమైన లోక్‌సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవగాహన ఉండాలని, అలాంటివారిని గుర్తించి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. కానీ, తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థిని చూసి కాకుండా కారు, సారు, సర్కార్‌ను చూసి ఓట్లు వేయాలని టీఆర్ ఎస్ ప్రచారం చేస్తుందని, అటువంటి వారిని గెలిపిస్తే లోక్‌సభలో ఏమి మాట్లాడతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుధీర్ రెడ్డి గెలుపు కోసం తన నియోజకవర్గాన్ని వదిలేసి ఇక్కడ ప్రచారం చేస్తే గెలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డిని ఎల్బీనగర్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసి గెలిపిస్తే వారికి నమ్మకద్రోహం చేసి పార్టీ మారిన సుధీర్ రెడ్డిని ప్రజలు క్షమిస్తారా? అని ప్రశ్నించాడు. తనను మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని అందరితో మాట్లాడి ఒప్పించి తనకు టికెట్ రాగానే ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడానికి కారణాలను కార్యకర్తలకు, ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అంగట్లో పశువులను కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పడానికి ప్రజలు, టీఆర్‌ఎస్ సానుభూతి పరులు కాంగ్రెస్‌కి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జీరోగా ఉన్న సుధీర్ రెడ్డిని కాంగ్రెస్ అనేక పదవులు ఇచ్చి హీరోను చేస్తే కేసీఆర్‌కు అమ్ముడుపోయి విలన్ అయ్యారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల కురుక్షేత్రంలో అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసిన కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల సహకారంతో దైర్యంగా పోరాటం చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మొద్దని, ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షాన్ని గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసి డబ్బుల కోసం అధికార పార్టీకి అమ్ముడు పోయారని, అయినా కార్యకర్తలు ఆందోళనకు లోనవ్వకూడదని వారికి తాను అన్నివిధాల అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఎల్బీనగర్ మాజీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కొప్పుల నర్సింహా రెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, చిలుక మధుసుదన్ రెడ్డి, అప్సర్ ఖాన్, సామ రామ్మోహన్ రెడ్డి, బీమిడి రామకృష్ణా రెడ్డి, బద్దుల వెంకటేష్ యాదవ్, శశీధర్ రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి