రాష్ట్రీయం

నగదు సమతుల్యత అతి పెద్ద సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: దేశంలో నగదు సమతుల్యతను సాధించడం ఆర్‌బీఐ ముందుండే అతి పెద్ద సవాల్ అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. మాజీ ఐఎఎస్ అధికారి ఎం రామకృష్ణయ్య నాలుగో స్మారక దినోత్సవం సందర్భంగా హమ్ సబ్ హిందుస్థానీ ట్రస్టు, ఎంఎస్‌ఎస్ , ఆర్‌జీ కేడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ ఒక చిన్న బిడ్డను సాకినట్టు రూపాయిని కనిపెట్టుకోవాలని ఆ బాధ్యతను ఆర్‌బీఐ దిగ్విజయంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
రూపాయి విలువ పెరిగితే మంచిదని కొందరు, పతనమైతే మొత్తం పతనమైనట్టు మరికొందరు భావిస్తుంటారని వాస్తవానికి రూపాయి విలువ సాపేక్షమైనదేనని చాలా మందికి తెలియదని అన్నారు. ఆర్‌బీఐ కార్యనిర్వహణ చాలా సంక్లిష్టమైందని, వడ్డీ రేట్ల పెంపు, తగ్గింపు అంశంపైనా, ద్రవ్యోల్బణానికి సంబంధించి అనేక గాధలు వింటుంటామని, ఒక్కోమారు ద్రవ్యోల్బణం సైతం చాలా మంచిదేనని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అపరిమితంగా పెరగడం, కనిష్టస్థాయికి తగ్గడం కూడా మంచిది కాదని, కొంత మేర ద్రవ్యోల్బణం కొనసాగడం దేశంలో నగదు చెలామణికి మంచిదని అన్నారు. దేశంలో నల్లధనం అంటూ వేరుగా ఉండదని, ఒక సమయంలో నల్లధనం మరో సమయంలో అసలు నగదుగా మారుతుందని, అదే మరో సమయంలో నల్లధనం అవుతుందని అన్నారు. న్యాయబద్ధంగా జరుగుతున్న లావాదేవీల్లోనూ నల్లధనం ప్రభావం ఉంటుందని, దేశంలో పెద్దనోట్ల రద్దు వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని చెప్పారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గి వస్త్ధురలు అపరిమితంగా పెరిగాయని, జింబాబ్వేలో పరిస్థితి మరింత భిన్నమని , 290 శాతం ద్రవ్యోల్బణం పెరిగి ఏదీ కొనలేని, అమ్మలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో నగదు ఉనికిని కాపాడటమేగాక, పొదుపుదార్ల హక్కుల రక్షణ, బ్యాంకుల పరిరక్షణ, సామాన్యుల లావాదేవీలకు ఆర్‌బీఐ బాసటగా ఉంటుందని చెప్పారు. అనేక కోణాల్లో ఎప్పటికపుడు పరిస్థితులను మదింపు వేస్తూ తగిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా దేశంలో నగదు విలువ దిగజారకుండా చూసే బాధ్యత ఆర్‌బీఐ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. నూరు శాతం బ్యాంకు ఖాతాలున్న ఎర్నాకులం లాంటి జిల్లాల్లో సైతం ప్రజలు ఇంకా వడ్డీవ్యాపారులపై ఆధారపడటం గమనార్హమని, ఈ పరిస్థితి చూస్తుంటే బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావల్సి ఉందని అర్ధమవుతోందని సుబ్బారావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ స్వరణ్‌జిత్ సేన్, హెచ్‌ఎస్‌హెచ్‌టీ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ప్రమోద్ ఎస్ షిండే, ట్రస్టు అధ్యక్షుడు కమల్ నారాయణ్ అగర్వాల్, సురేంద్రలూనియా, సంయుక్త కార్యదర్శి ఎస్‌బీ కాబ్రా, పి పూర్ణ చందర్‌రావు, ఎంఎస్‌ఎస్ డైరెక్టర్ డాక్టర్ డీవీజీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మాజీ ఐఎఎస్ అధికారి రామకృష్ణయ్య నాలుగో స్మారక దినోత్సవ సభలో మాట్లాడుతున్న
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు