రాష్ట్రీయం

టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తప్పుడు సర్వేలు.. దొంగ దెబ్బలు.. నేరాలు. ఘోరాలు.. గెలుపుకోసం అడ్డదారులు.. ఇవీ వైఎస్సార్ కాంగ్రెస్ విధానాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. బుధవారం ఉండవల్లిలో తన నివాసం నుంచి పార్టీ నేతలతో ఎలక్షన్ మిషన్-2019పై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లు కుమ్మక్కయి రోజుకో కుట్రకు తెరలేపుతున్నాయని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోకుండా కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే అందుకు రిటర్న్ గిఫ్ట్‌గా ఆయనకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓటేస్తే దొంగచేతికి తాళాలు ఇచ్చినట్టే అని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ ఎన్నికలతో సంబంధం లేదని చెప్తున్నారని, ఇవ్వాల్సిన గిఫ్ట్‌లన్నీ జగన్‌కు ఇప్పటికే పంపారన్నారు. ఎవరెన్ని కుట్రలు జరిపినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజల్లో టీడీపీ పట్ల సానుకూలత బాగా ఉందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతటి ఉత్సాహం ఏనాడూ లేదన్నారు. రాష్ట్రంలో జరిగేది ఎన్నికల యుద్ధమని చెప్తూ భావితరాల భవిష్యత్ కోసమే తన పోరాటం, ఏపీ నిర్మాణం కోసం ఆరాటమే తన అంతిమ లక్ష్యాలని తెలిపారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. స్టార్ క్యాంపైనర్ల సభలతో పాటు స్వయంగా ప్రజలతో మమేకం కావాలన్నారు. అన్ని వర్గాల సామాజికనేతల మద్దతు కూడగట్టాలని సూచించారు. ఆయా వర్గాలకు ప్రభుత్వపరంగా జరిగిన మేళ్లను వివరిస్తూ కొనసాగింపుగా టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ఆశీస్సులు పొందాలన్నారు. అభ్యర్థుల ఎంపిక అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. అయినా కొందరికి అసంతృప్తి కలగటం సహజమని వారందరికీ భవిష్యత్‌లో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలందరి భవిష్యత్ తమదేనని భరోసా ఇచ్చారు. ప్రజాయుద్ధంలో ప్రతి కార్యకర్తా ఓ సైనికుడే అని అభివర్ణించారు. ఈ గడ్డపై ఉన్నవాళ్లే ఇక్కడ రాజకీయాలు చేయాలన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌తో లాలూచీపడే వైసీపీ వల్ల రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వని ప్రధాని మోదీని నిగ్గదీసే ధైర్యం జగన్‌కు లేదన్నారు. పోలవరంపై కేసీఆర్‌తో కలసి పిటిషన్లు వేస్తారని, కేసీఆర్ ఆంధ్రులను అవమానపరచిన రోజున జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. జగన్ కేసుల దర్యాప్తులో నత్తనడక మోదీ గిఫ్ట్ అన్నారు. మోదీతో కలసి క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నారని కేసులు మాఫీ చేస్తే ప్రత్యేక హోదా అడగమని మోదీతో, కప్పం కడతా- మీ వద్ద భూములు స్వాధీనం చేసుకోవద్దని కేసీఆర్‌తో జగన్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీఆర్‌ఎస్, వైసీపీలు కుట్ర పన్నాయన్నారు. జగన్ మేలు కోసం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజల అండదండలు తమ పార్టీకి పెట్టని కోటన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారు.. అధికారులను జైలుకు పంపుతారు.. టీడీపీ డేటా చోరీ చేస్తారు.. లక్షలాది ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తారు.. చిన్నాన్న హత్య కేసులో సాక్ష్యాలను తారుమారుచేస్తారని జగన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. భయంకరమైన నేరచరిత్ర ఉన్న వైసీపీ ఆర్థిక మూలాలపై దాడులు చేస్తుందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు.