రాష్ట్రీయం

జనసేనలోకి నాగబాబు, ఎస్పీవై రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 20: తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా ప్రజాతీర్పు కోసం ధైర్యంగా ఎన్నికల రణక్షేత్రంలో పోటీకి నిలబెడుతున్నట్టు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యత చంద్రబాబుది, వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యత జగన్‌ది అయితే జనసేన అభ్యర్థుల గెలుపు బాధ్యత మాత్రం జన సైనికులదేనన్నారు. ప్రముఖ సినీనటుడు నాగబాబు, నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి బుధవారం జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరికి పార్టీ కండువా కప్పిన పవన్ కళ్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాగబాబు తనకు రాజకీయ గురువని తెలిపారు. తనలో రాజకీయ చైతన్యం నింపిన వ్యక్తిగా చెప్పారు. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకోస్తున్నామని, దొడ్డిదారిన కాకుండా ప్రజాతీర్పు కోసం ధైర్యంగా ఎన్నికల రణక్షేత్రంలో పోటీకి నిలబెడుతున్నట్టు వెల్లడించారు. నాగబాబును నరసాపురం లోక్‌సభ స్థానం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబెడుతున్నట్టు ప్రకటించారు. నాగబాబుకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నాగబాబు అని అన్నారు. అందుకే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం నుండి పోటీకి దించుతున్నట్టు తెలిపారు. తన ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. ఆయనను మనస్ఫూర్తిగా పార్టీలోనికి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ తాను ఎత్తుకొని ఆడించిన తమ్ముడు తామంతా ఆశ్చర్యపోయే రీతిలో గొప్ప నాయకుడిగా ఎదిగాడనన్నారు. మన దేశంలో ఇలాంటి నాయకుడు ఉన్నాడా అనే స్థాయికి పవన్ ఎదిగాడన్నారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ అన్నారు. ఆయన వ్యక్తిత్వం జనసేనలో ఉన్న చాలామంది కంటే తనకే ఎక్కువ తెలుసన్నారు. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు తాను నమ్మలేదన్నారు. పేరుకే ఆయన తనకు తమ్ముడు కానీ అందరిలా తనకు కూడా పవన్ నాయకుడేనన్నారు. పార్టీలో చేరక ముందేనాయకుడు పవన్ కోసం ఏ పని చేయడానికయినా సిద్ధమైనట్టు చెప్పారు.
ఇలాఉంటే టీడీపీ ఎంపీ సీటు ఆశించిన భంగపడ్డ నంద్యాల సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు. తన కుమార్తెతో పాటు విజయవాడలో పవన్‌ను కలిసిన ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు. అలాగే టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ కూడా జనసేన పార్టీలో చేరారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కూడా జనసేన పార్టీలో చేరారు. వీరికి పవన్ పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.
లోక్‌సభ్య అభ్యర్థులు వీరే
విజయనగరం-ముక్కా శ్రీనివాసరావు, కాకినాడ- జ్యోతుల వెంకటేశ్వరరావు, నర్సాపురం- నాగబాబు. వీరికి పార్టీ బీ ఫారాలను పవన్ కళ్యాణ్ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అందించారు.

చిత్రం.. నాగబాబుకు నర్సాపురం లోక్‌సభ స్థానానికి బీ-ఫారమ్ అందజేస్తున్న పవన్ కళ్యాణ్