రాష్ట్రీయం

ఏపీని మింగేందుకు వస్తున్న గద్దలకు బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ని మింగేసేందుకు వస్తున్న గద్దలకు బుద్ధి చెప్పాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్జీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మూడు పార్టీలు ఏపీపై కుట్రలతో పేట్రేగిపోతున్నాయంటూ మండిపడ్డారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఎలక్షన్ మిషన్‌లో భాగంగా టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీపై గద్దల మాదిరిగా వాలుతున్నారని విమర్శించారు. జగన్, కేసీఆర్, మోదీ కుట్రలు పెచ్చుమీరుతున్నాయని, టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు, నాయకులకు ప్రలోభాలు, కార్యకర్తలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయన్నారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, వదంతులతో అపోహలు సృష్టించడం వంటి మైండ్ గేమ్స్‌తో ఆదాల, అవంతి, ఆమంచి, మాగుంటలను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బూత్ కన్వీనర్ అప్రమత్తంగా ఉండాలని, ప్రతర్థుల ప్రలోభాలను అధిగమించాలని సూచించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటారని, ఆంధ్ర వైద్యులపై నమ్మకం లేదంటారని, తెలంగాణ పోలీసులు కావాలని, తెలంగాణ ఆసుపత్రుల్లో వైద్యం అంటారని, కానీ ఆంధ్రలో ఓట్లు మాత్రం కావాలంటారని ఎద్దేవా చేశారు. చిన్నాన్న హత్యను రాజకీయం చేస్తారని, టీడీపీపై నిందలు వేస్తారన్నారు. కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తానని, తన మంత్రులను ఏపీపైకి పంపి రెచ్చగొట్టిస్తారంటూ ధ్వజమెత్తారు. జగన్ మేలు కోసమే మోదీ, కేసీఆర్ అండదండలని, మూడు పార్టీల కుట్రకు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే టీడీపీకే మద్దతుగా నిలవాలని కోరారు. ప్రత్యేక హోదా వైకాపాకు బోరింగ్ సబ్జెక్టు అంటూ వైకాపా ఎంపీ అభ్యర్థులు చెబుతున్నారని, వీళ్లను ఎంపీలుగా గెలిపిస్తే, ఏం చేస్తారన్నారు. మోదీ మేలు కోసమే రాజీనామాలు చేశారని, ఎన్నిక రాకుండా చూసి రాజీనామా డ్రామా ఆడారన్నారు. అవిశ్వాసంలో మోదీని గెలిపించేందుకే వైకాపా ఎంపీల డ్రామాలన్నారు. గతంలో రైతు రుణమాఫీ అసాధ్యమని జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
జగన్ నిర్వాకం వల్ల దాదాపు లక్ష ఎకరాలు నిరుపయోగంగా మారాయని బాబు ధ్వజమెత్తారు. వాన్‌పిక్‌కు సంబంధించి 28 వేల ఎకరాలు, బ్రాహ్మణి స్టీల్స్‌కు 10 వేల ఎకరాలు, లేపాక్షికి సంబంధించి 8800 ఎకరాలు జగన్ కేసుల్లో చిక్కుకుని ఉపయోగం లేకుండా పోయాయన్నారు. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సమాజానికే పెను ప్రమాదంగా జగన్ మారారని, కోడికత్తి కేసు డ్రామా అని, పులివెందుల హత్యపై డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీడీపీ డేటా చోరీకి భారీ కుట్ర చేశారని, ఫారం -7 ద్వారా 9 లక్షల ఓట్ల తొలగింపునకు ఇంకో కుట్ర చేశారన్నారు. ఈ కుట్రలకు జగన్ చేసే మేనిపులేషన్, వదంతులు అదనమని ఆరోపించారు. జగన్ కుట్రలకు, డ్రామాలకు అంతులేకుండా పోయిందని ఆరోపించారు. ఇంకా ఎన్నికలకు ఇంకా 18 రోజులే వ్యవధి ఉందని, చివరి నాలుగు రోజులు తీసేస్తే, మిగిలేది 14 రోజులేనన్నారు. ఈ రెండు వారాల్లో ప్రచారం ఉద్ధృతం చేయాలని, రైతులు, మహిళలంతా తెలుగుదేశానికే ఏకపక్షంగా మద్దతు పలుకుతున్నారన్నారు. యువతరాన్ని ప్రొత్సహించాలని, వారి మద్దతు పొందాలన్నారు. ప్రతి కార్యకర్త రోజుకు 18 గంటలు పనిచేయాలని, ఇంటింటికీ వెళ్లి పలకరించాలని, అన్ని కులాల మద్దతు పొందాలన్నారు. ఆ కులానికి ఏమి చేశామో చెప్పాలని సూచించారు. ఇంకా చేస్తామన్న నమ్మకం పెంచాలన్నారు. అందరినీ ఆక్టుకోవాలని, పార్టీకి మద్దతు రాబట్టాలని దిశానిర్దేశం చేశారు. గతంలో ఏమైనా అపోహలు ఉంటే తొలగించాలని, చేయి చేయి కలపాలన్నారు. మనకు దూరమైన వాళ్ల మద్దతు కూడా కూడగట్టాలన్నారు. దిగివచ్చి తనను సాయం అడిగారన్న సంతృప్తి ఓటర్లకు రావాలన్నారు. ఇది నేతల లౌక్యానికి, కలివిడితనానికి పరీక్షా సమయమని, ప్రతి కార్యకర్త ప్రతి రోజు 10 ఓట్లు రాబట్టాననే సంతృప్తితో ఇంటికి చేరాలన్నారు. పార్టీ గెలుపే తమ గెలుపుగా భావించాలని, ఈ రోజు ఎన్ని ఓట్లు అదనంగా రాబట్టామని ప్రతి నేత ఏరోజుకారోజు బేరీజు వేసుకోవాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం చేశామని, అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.